ఇరాన్ దివంగత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. రాజధాని టెహ్రాన్‌లో ఆయనతో పాటు మృతి చెందిన కుటుంబ సభ్యుల శవపేటికలను ప్రజల సందర్శనార్థం ఉంచారు. వీటిలో ఆయన 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మదీ శవపేటిక కూడా ఉండటం భావోద్వేగ వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేసింది. చిన్నారి ఫొటో ఫ్రేమ్‌ను కూడా పక్కనే ఉంచారు.
ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. నాలుగు నెలల తర్వాత ఇప్పుడు వారి అంత్యక్రియలు ఇరాన్, ఇరాక్‌లోని ఐదు నగరాల్లో ఏడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఖమేనీ భౌతికకాయాన్ని ఆయన స్వస్థలం మషహద్‌లో ఈ నెల 9న ఖననం చేయనున్నారు.
ఈ రోజు టెహ్రాన్‌లో ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచగా వేలాది మంది తరలివచ్చారు. ప్రతీకార సూచనగా ఎర్రజెండాలు పట్టుకుని ‘డెత్ ఆఫ్ అమెరికా’ అంటూ నినాదాలు చేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఖమేనీతో సన్నిహితంగా పనిచేసిన నాయకులు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















