అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతారనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కువగా వార్తాపత్రికలు చదువుతానని, వాటిలోనూ తన గురించి వచ్చిన కథనాలనే ఎక్కువగా చూస్తానని ఆయన వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి ఉషా వాన్స్ హోస్ట్ చేసిన ‘స్టోరీ టైమ్ విత్ సెకండ్ లేడీ’ పాడ్‌కాస్ట్‌లో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా వైట్‌హౌస్ హిస్టారికల్ అసోసియేషన్ ప్రచురించిన ‘ప్రెసిడెంట్స్ ప్లే!’ పుస్తకాన్ని ట్రంప్ చదివి వినిపించారు. అందులో మాజీ అధ్యక్షుల ఆసక్తులు, వారి అలవాట్ల గురించి ప్రస్తావించారు. వైట్‌హౌస్ ప్రాంగణంలో నిర్మిస్తున్న బాల్‌రూమ్ గురించి కూడా మాట్లాడారు.
అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం (జులై 4) సందర్భంగా ఈ పాడ్‌కాస్ట్ వీడియోను ఉషా వాన్స్ ఎక్స్‌లో షేర్ చేశారు.
సూపర్‌బౌల్ ఫొటోను చూపిస్తూ ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. బరాక్ ఒబామా, జో బైడెన్, బుష్ కుటుంబాలను ఫుట్‌బాల్ వీక్షణకు ఆహ్వానిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందని చెప్పారు. ఇది ‘ప్రెసిడెంట్స్ రీయూనియన్’లా ఉంటుందని, మీడియాకు మంచి హడావిడి అవుతుందని ఆయన అన్నారు.
మాజీ అధ్యక్షుల జీవితశైలిపై కూడా ట్రంప్ మాట్లాడారు. వైట్‌హౌస్‌లో ఉండటం గౌరవమని, ప్రజల కోసం పని చేయడం వల్ల అక్కడ గడిపే సమయం పరిమితమని చెప్పారు. బిల్ క్లింటన్ జాగింగ్ అలవాటును కూడా ప్రస్తావిస్తూ ఆయనను ప్రశంసించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















