కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మారుతీ సుజుకీ తన సర్వీస్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కొత్తగా 500 సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు కంపెనీ ఎండీ, సీఈఓ హిసాషి టకూచీ తెలిపారు.
కంపెనీ 6,000వ సర్వీస్ టచ్‌పాయింట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మారుతీ సుజుకీ వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వేగవంతమైన, నాణ్యమైన సేవలను అందించేందుకు ఈ విస్తరణ చేపడుతున్నట్లు వెల్లడించారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 502 కొత్త సర్వీస్ కేంద్రాలను ప్రారంభించినట్లు టకూచీ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సర్వీస్ నెట్‌వర్క్ ద్వారా 2.84 కోట్లకు పైగా వాహనాలకు సేవలు అందించినట్లు పేర్కొన్నారు.
మారుతీ సుజుకీ సర్వీస్ టచ్‌పాయింట్ల సంఖ్య గత కొన్నేళ్లలో గణనీయంగా పెరిగింది. 2021లో 4,000గా ఉన్న టచ్‌పాయింట్ల సంఖ్య 2024 నాటికి 5,000కు చేరగా, ప్రస్తుతం 6,000 మార్కును దాటింది.
దేశంలోని 3,000కు పైగా నగరాలు, పట్టణాల్లో మారుతీ సర్వీస్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వినియోగదారులకు చేరువ కావడమే లక్ష్యమని పేర్కొంది.
వాహనాల అమ్మకాలతో పాటు ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా ఆటోమొబైల్ రంగంలో కీలకమవుతున్న నేపథ్యంలో మారుతీ ఈ విస్తరణకు ప్రాధాన్యం ఇస్తోంది. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా సర్వీస్ సదుపాయాలను పెంచడం ద్వారా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచాలని కంపెనీ భావిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















