వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలని లక్ష్యంగా పెట్టుకున్న అర్జెంటీనాకు ఫైనల్‌కు ముందు కొత్త ఆందోళన మొదలైంది. ప్రత్యర్థి స్పెయిన్ జట్టు కంటే.. మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించనున్న స్లోవ్కో విన్సిచ్ నియామకమే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆయన రిఫరీగా ఉన్న మ్యాచ్‌లో అర్జెంటీనా ఓటమి చవిచూడటమే ఇందుకు కారణం.
ఫిఫా ఫైనల్ మ్యాచ్‌కు స్లోవేనియాకు చెందిన 47 ఏళ్ల రిఫరీ స్లోవ్కో విన్సిచ్‌ను ఎంపిక చేసింది. 2010 నుంచి అంతర్జాతీయ స్థాయిలో రిఫరీగా సేవలందిస్తున్న ఆయనకు ప్రపంచస్థాయి మ్యాచ్‌లను నిర్వహించిన అనుభవం ఉంది. అయితే అర్జెంటీనా అభిమానుల్లో మాత్రం 2022 ప్రపంచకప్‌లో జరిగిన ఓ మ్యాచ్ జ్ఞాపకాలు మెదులుతున్నాయి.
ఖతార్ వేదికగా జరిగిన 2022 ప్రపంచకప్‌లో అర్జెంటీనా తొలి లీగ్ మ్యాచ్‌లో సౌదీ అరేబియాతో తలపడింది. ఆ మ్యాచ్‌కు విన్సిచ్ రిఫరీగా వ్యవహరించారు. ప్రారంభంలో అర్జెంటీనాకు పెనాల్టీ ఇవ్వడంతో పాటు సౌదీ ఆటగాళ్లకు పలు ఎల్లో కార్డులు చూపించారు. దీంతో ఆయన అర్జెంటీనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ మ్యాచ్ రెండో అర్ధభాగంలో సౌదీ అరేబియా అద్భుతంగా పుంజుకుని 2-1తో అర్జెంటీనాను ఓడించింది.
ఇప్పుడు అదే రిఫరీ ప్రపంచకప్ ఫైనల్‌కు రావడంతో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టుపై ఆసక్తి నెలకొంది. కీలక మ్యాచ్‌లో ఆటగాళ్లు క్రమశిక్షణ పాటించాలని, రిఫరీ నిర్ణయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఫుట్‌బాల్ నిపుణులు సూచిస్తున్నారు.
ఫైనల్ రిఫరీగా ఎంపికపై భావోద్వేగానికి గురైన విన్సిచ్
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు తనను రిఫరీగా ఎంపిక చేసిన విషయం తెలిసిన తర్వాత విన్సిచ్ భావోద్వేగానికి గురయ్యారు. సహచరులు అభినందనలు తెలుపుతున్న సమయంలో ఆయన కన్నీటి పర్యంతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లకు విన్సిచ్ రిఫరీగా వ్యవహరించారు. ఈక్వెడార్ ఆటగాడు పియెరో హిన్‌కేపీకి రెడ్ కార్డు చూపించిన మ్యాచ్ కూడా అందులో ఉంది. మైదానంలో క్రమశిక్షణ విషయంలో ఆయన కఠినంగా వ్యవహరిస్తారని పేరు ఉంది.
మరోవైపు స్పెయిన్ జట్టు ఆడిన పలు మ్యాచ్‌లకు కూడా విన్సిచ్ రిఫరీగా వ్యవహరించిన అనుభవం ఉంది. ఇది కూడా ఫైనల్‌కు ముందు అర్జెంటీనా శిబిరంలో చర్చకు దారితీస్తోంది. కీలకమైన తుదిపోరులో విన్సిచ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రపంచకప్ విజేతలకు తొలిసారి ప్రత్యేక రింగులు
ఇదిలా ఉండగా, ఫిఫా ప్రపంచకప్ విజేతలకు తొలిసారి ప్రత్యేక రింగులను అందించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 2026 రింగులను సిద్ధం చేయగా, విజేత జట్టులోని ఆటగాళ్లకు 30 రింగులు అందించనున్నారు. మిగిలిన వాటిని అభిమానులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో ఇప్పుడు ఫైనల్, మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. స్పెయిన్-అర్జెంటీనా తుదిపోరుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















