దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఉదయం లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. బుధవారం భారీ లాభాలతో ముగిసిన నేపథ్యంలో, గురువారం గరిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లలో ఒడిదుడుకులు కనిపించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లపై అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రభావం చూపుతోంది.
గత సెషన్ ముగింపు 77,654 వద్ద ఉన్న సెన్సెక్స్ గురువారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమై తొలుత నష్టాల్లోకి జారుకుంది. అనంతరం కోలుకుని స్వల్ప లాభాల్లోకి వచ్చింది. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్ 31 పాయింట్ల లాభంతో 77,686 వద్ద కొనసాగగా, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 24,270 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో హీరో మోటోకార్ప్, విప్రో, పెర్సిస్టెంట్, ఆల్కెమ్ ల్యాబ్స్, ఓఎన్‌జీసీ వంటి షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు కేపీఐటీ టెక్, వారీ ఎనర్జీస్, డాబర్ ఇండియా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ప్రీమియర్ ఎనర్జీస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఇక బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 307 పాయింట్ల నష్టంతో ఉండగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 152 పాయింట్లు దిగజారింది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.75 వద్ద స్వల్పంగా బలపడటం మార్కెట్‌కు కొంత ఊరటనిస్తోంది. మొత్తంగా అంతర్జాతీయ పరిణామాలు, లాభాల స్వీకరణ, బ్యాంకింగ్ షేర్ల కదలికల నేపథ్యంలో సూచీలు ప్రస్తుతం అప్రమత్తమైన ధోరణిలో కొనసాగుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















