భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌పై ఇంకా స్పష్టత రాలేదు. షెడ్యూల్ ప్రకారం గతేడాది ఆగస్టులో టీమ్‌ఇండియా బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉండగా, అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా సిరీస్ వాయిదా పడింది. మూడు వన్డేలు, మూడు టీ20లతో జరగాల్సిన ఈ పర్యటనను ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించేలా అప్పట్లో నిర్ణయించారు.
అయితే, బంగ్లాదేశ్‌లో భద్రతా పరిస్థితులపై బీసీసీఐ మరోసారి సమీక్షిస్తున్నట్లు వార్తలు రావడంతో సిరీస్ జరుగుతుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత జట్టు తమ దేశంలో పర్యటిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన.. ఈ విషయంలో బీసీసీఐతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈమెయిల్స్ ద్వారా కూడా చర్చలు జరుపుతున్నామని, సిరీస్‌ను నిర్వహించేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే సిరీస్ క్రికెట్ అభిమానులకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని తమీమ్ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్ సురక్షితమైన దేశమని, భారత జట్టుకు ఎలాంటి భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















