ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న సూపర్ ఎల్‌నినో పరిస్థితులు, వాటి ప్రభావంతో ఎదురయ్యే సాగునీటి సమస్యలు, రైతుల పరిస్థితిపై ఇరువురు చర్చించారు.
సూపర్ ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతుల్లో ముందస్తు అవగాహన కల్పించాలని పవన్ కల్యాణ్ సూచించారు. రైతులతో ప్రత్యక్షంగా సమావేశాలు నిర్వహించి, ప్రస్తుత పరిస్థితులు, నీటి లభ్యత, పంటల సాగుపై ప్రభావం వంటి అంశాలను వారికి వివరించాలని అన్నారు.అదే సమయంలో సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పవన్ సూచించారు.
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.ఏలేరు ప్రాజెక్టు నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందుకు మంత్రి నిమ్మల రామానాయుడికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీటి నిర్వహణ, సాగునీటి సరఫరాపై సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















