ఫ్యాషన్‌గా కనిపించాలనో, నెరిసిన జుట్టును దాచుకోవాలనో.. కారణం ఏదైనా ప్రస్తుతం చాలామంది హెయిర్ కలర్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే హెయిర్ కలర్స్ తయారీలో ఉపయోగించే కొన్ని రసాయనాలు ప్రతి ఒక్కరికీ సరిపడకపోవచ్చు. వీటి వల్ల కొందరిలో జుట్టు, కుదుళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే హెయిర్ కలర్ ఉపయోగించిన తర్వాత కనిపించే కొన్ని లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు.
జుట్టు పొడిబారి గడ్డిలా మారడం: హెయిర్ కలర్ వేసుకున్న తర్వాత జుట్టు సహజమైన తేమను కోల్పోయి పొడిగా, గరుకుగా మారితే ఆ ఉత్పత్తి మీ జుట్టుకు సరిపోకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
జుట్టు ఎక్కువగా రాలడం: కొన్ని హెయిర్ కలర్స్‌లోని రసాయనాలు కుదుళ్లను బలహీనపరిచే అవకాశం ఉంది. రంగు వేసుకున్న తర్వాత సాధారణం కంటే ఎక్కువగా జుట్టు రాలుతున్నట్లు అనిపిస్తే ఆ ఉత్పత్తిని ఉపయోగించడం ఆపేయడం మంచిది.
దురద, ఎర్రబడటం: హెయిర్ కలర్ ఉపయోగించిన తర్వాత తలపై దురద, మంట, ఎర్రబడటం లేదా ప్యాచుల్లా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే అలర్జీ లేదా అసహనం ఉండే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా నిపుణుల సలహా తీసుకోవాలి.
జుట్టు తెగిపోవడం, చివర్లు చిట్లడం: హెయిర్ కలర్స్‌లోని కొన్ని రసాయనాలు జుట్టును బలహీనపరచవచ్చు. ఫలితంగా జుట్టు పెళుసుగా మారి సులభంగా తెగిపోవడం, చివర్లు చిట్లడం వంటి సమస్యలు కనిపించవచ్చు.
జుట్టు మెరుపు తగ్గడం: కుదుళ్లలో సహజంగా ఉత్పత్తయ్యే నూనెలు జుట్టుకు మృదుత్వం, మెరుపును అందిస్తాయి. కొన్ని రకాల హెయిర్ కలర్స్ ఈ సహజ నూనెలపై ప్రభావం చూపడం వల్ల జుట్టు నిర్జీవంగా, డల్‌గా కనిపించే అవకాశం ఉంది.జుట్టు ఆరోగ్యం దెబ్బతినడం: తరచుగా హెయిర్ కలర్ ఉపయోగించడం వల్ల జుట్టు బలహీనంగా మారి పెళుసుగా తయారయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వరుసగా రంగులు మార్చడం లేదా తరచూ కెమికల్ ట్రీట్‌మెంట్స్ చేయడం వల్ల జుట్టుపై అదనపు ప్రభావం పడవచ్చు.
డ్యామేజ్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
జుట్టుకు రంగు వేసుకునే వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా కేశాలపై పడే ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. వీలైనంత వరకు తక్కువ రసాయనాలు కలిగిన లేదా సహజసిద్ధమైన పదార్థాలతో తయారైన ఉత్పత్తులను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అవసరం లేకపోయినా తరచుగా జుట్టుకు రంగు వేయకుండా.. అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించడం మంచిది. హెయిర్ కలర్ వేసుకున్న తర్వాత జుట్టుకు తగిన పోషణ అందించే హెయిర్ మాస్కులు, కండిషనర్ వంటివి ఉపయోగించడం ద్వారా జుట్టును సంరక్షించుకోవచ్చు.
హెయిర్ కలర్ సహజసిద్ధమైన పదార్థాలతో తయారైనదైనా.. ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. ముఖ్యంగా కొత్త ఉత్పత్తిని ఉపయోగించే ముందు దానికి మీ చర్మం స్పందన ఎలా ఉందో తెలుసుకోవడం అవసరం. ఏదైనా అసాధారణమైన దురద, వాపు, మంట లేదా తీవ్రమైన చర్మ ప్రతిచర్య కనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















