సరైన మార్పులు, వినూత్న బోధనా పద్ధతులు అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా నిలవగలవని సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం అంగడికిష్టాపూర్ పాఠశాల నిరూపిస్తోంది. ఒకప్పుడు విద్యార్థుల సంఖ్య లేక మూసివేత అంచుకు చేరిన ఈ పాఠశాల.. ఇప్పుడు ఆరు గ్రామాల తల్లిదండ్రులకు మొదటి ఎంపికగా మారింది.
2015లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో పాఠశాలను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే అప్పటి ప్రధానోపాధ్యాయుడు ఓంకార్ రాధాకృష్ణ, సర్పంచి రాములుగౌడ్ చొరవ తీసుకుని తల్లిదండ్రులను ఒప్పించి పిల్లలను పాఠశాలలో చేర్పించారు. ఆంగ్ల బోధనను ప్రారంభించడంతో పాటు డిజిటల్ తరగతులను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులను బృందాలుగా విభజించి ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ప్రస్తుతం పూర్వ ప్రాథమిక విద్య, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీతో పాటు 1 నుంచి 8వ తరగతి వరకు బోధన కొనసాగుతోంది. మొత్తం 218 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు బాలకిషన్ ఆధ్వర్యంలో యోగా, కరాటే, భరతనాట్యం వంటి ప్రత్యేక శిక్షణతో పాటు వ్యక్తిత్వ వికాసంపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఈ పాఠశాలపై నమ్మకంతో జగదేవపూర్ మండలంలోని తీగుల్, అక్కారం, మర్కూక్ మండలంలోని గణేశ్‌పల్లి, చేబర్తి, ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల నుంచి విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. విద్యాకమిటీ అనుమతితో తల్లిదండ్రులే ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేసుకోవడం.. ఈ పాఠశాలకు పెరిగిన ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















