పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శామ్‌సంగ్ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అంతర్జాతీయంగా మెమొరీ చిప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ముడిసరుకుల ధరలు భారీగా పెరిగినా.. భారత మార్కెట్లో ఫోన్లపై రాయితీలు, వడ్డీ రహిత ఈఎంఐ సదుపాయాలు అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
శామ్‌సంగ్ సౌత్‌వెస్ట్ ప్రెసిడెంట్, సీఈఓ జేబీ పార్క్ మాట్లాడుతూ.. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని సాధ్యమైనంత వరకు కంపెనీయే భరిస్తోందని, వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ముడిసరుకుల ధరల పెరుగుదలతో భారత ఎలక్ట్రానిక్స్ మార్కెట్ దాదాపు 15 శాతం మందగించినట్లు ఆయన వెల్లడించారు.
గత ఆరు నెలల్లో మెమొరీ చిప్‌ల ధరలు గణనీయంగా పెరగడంతో స్మార్ట్‌ఫోన్‌ల ధరలు 20 నుంచి 30 శాతం వరకు పెరిగాయని చెప్పారు. కొత్త చిప్ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి రావడానికి మరో 12 నుంచి 18 నెలలు పట్టే అవకాశం ఉండటంతో, చిప్ ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు.
ఇటీవల విడుదలైన గెలాక్సీ Z8 ఫోల్డబుల్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు భారత్‌లోనే తయారవుతున్నాయని, ఈ నెల 7వ తేదీ నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. అలాగే నోయిడా, బెంగళూరులోని ఆర్‌అండ్‌డీ కేంద్రాల్లో అభివృద్ధి చేసిన కొత్త ఏఐ ఫీచర్లు వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందిస్తున్నాయని తెలిపారు.
ఫోన్ కాల్ సమయంలో చుట్టూ ఉన్న శబ్దాన్ని ఆటోమేటిక్‌గా తగ్గించి స్వరం స్పష్టంగా వినిపించే సాంకేతికతను గెలాక్సీ ఏఐలో అందుబాటులోకి తీసుకువచ్చామని, హిందీ, గుజరాతీ భాషల్లో ఇప్పటికే లైవ్ కాల్ అసిస్ట్, ఇంటర్‌ప్రిటర్ సేవలు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే మరిన్ని భారతీయ భాషల్లో కూడా ఈ సేవలను విస్తరించనున్నట్లు శామ్‌సంగ్ తెలిపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















