పల్నాడు జిల్లాలో ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. గుంటూరులోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్న బాల సైదులు.. అదే కళాశాలలో చదువుతున్న ఓ యువతితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. చిలకలూరిపేటకు చెందిన ఆ యువతిని శుక్రవారం ఉదయం మాట్లాడుకుందామని చెప్పి కారంపూడి మండలం చింతపల్లి సమీపంలోని కుడికాల్వకట్ట వద్దకు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన అనంతరం యువతిపై దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. కొంతకాలంగా యువతిపై సైదులుకు అనుమానం పెరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు ప్రణాళికతో ఆమెను అక్కడికి తీసుకువచ్చి హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ వ్యవహారం, ఇద్దరి మధ్య జరిగిన వివాదం, హత్యకు దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఘటనతో చింతపల్లి పరిసరాల్లో తీవ్ర కలకలం నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















