సరిహద్దు సహా ఇరు దేశాల మధ్య ఉన్న పలు అంశాలపై అపోహలను తొలగించుకోవడం, సమన్వయాన్ని పెంచుకోవడం లక్ష్యంగా భారత్-చైనా అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. దిల్లీలో జరిగిన వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (WMCC) 36వ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి ప్రస్తుత పరిస్థితిని అధికారులు సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రవహించే నదులకు సంబంధించిన డేటా షేరింగ్, సమన్వయం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
సమావేశంలో అన్ని అంశాలపై స్పష్టంగా చర్చించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు సమస్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
అయితే ఇటీవల ఇరు దేశాల మధ్య కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతున్న నేపథ్యంలో తాజా WMCC సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. సరిహద్దు సమస్యల పరిష్కారంతో పాటు ఇరు దేశాల మధ్య సంప్రదింపులు, సమన్వయం కొనసాగించడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















