హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు యువత భారీగా తరలిరావడంతో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం పరిసరాల్లో రద్దీ నెలకొంది. ఎల్బీనగర్ పరిధిలోని స్టేడియం వద్దకు ఉదయం నుంచే పలువురు నిరుద్యోగులు చేరుకున్నారు. సమయం గడిచేకొద్దీ అభ్యర్థుల సంఖ్య పెరగడంతో పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఏర్పడ్డాయి.
ఉద్యోగాల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఉద్యోగాలపై స్పష్టత కోసం పెద్ద సంఖ్యలో యువత తరలిరావడంతో స్టేడియం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
అభ్యర్థుల రద్దీ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా స్టేడియం వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు. దరఖాస్తుదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో పరిస్థితిని పోలీసులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews
















