చట్టాన్ని పరిరక్షించాల్సిన న్యాయవాద వృత్తిలోనే నకిలీ ధ్రువపత్రాలతో కొందరు చలామణి అవుతున్న వ్యవహారం ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో ఉత్తర్‌ప్రదేశ్ బార్ కౌన్సిల్ చేపట్టిన తనిఖీల్లో 105 మంది నకిలీ న్యాయవాదుల వ్యవహారం బయటపడింది.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా న్యాయవాదుల విద్యార్హతలను ధ్రువీకరించే ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. పరిశీలనలో కొందరు నకిలీ న్యాయవాదులు కేవలం ఎల్ఎల్బీ పట్టాలను మాత్రమే కాకుండా పదో తరగతి, డిగ్రీ మార్కుల పట్టాలను సైతం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు.
అంతేకాకుండా ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల పేర్లతో నకిలీ డిగ్రీలను సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. అందులో అలహాబాద్ విశ్వవిద్యాలయం పేరుతో రూపొందించిన నకిలీ ధ్రువపత్రాలు కూడా ఉన్నట్లు తేలింది.
ఈ వ్యవహారంలో కౌశాంబీ జిల్లాకు చెందిన అమర్‌సింగ్ ఉదంతం మరింత సంచలనం కలిగించింది. అతడు దాదాపు 35 ఏళ్లుగా నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదిగా చలామణి అయినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. దీంతో నకిలీ విద్యార్హతలతో ఇంతకాలం న్యాయవాద వృత్తిలో కొనసాగిన వ్యక్తుల వ్యవహారంపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
నకిలీ న్యాయవాదుల వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్ బార్ కౌన్సిల్ అందించిన 105 మంది నిందితుల జాబితా ఆధారంగా ప్రయాగ్‌రాజ్ పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే 39 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మిగిలిన 66 మందిపై కూడా త్వరలో కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
నకిలీ ధ్రువపత్రాలతో న్యాయవాదులుగా కొనసాగిన వారిపై మరింత సమగ్రంగా విచారణ జరిపి, వారు ఎన్ని కేసుల్లో వాదనలు వినిపించారు? వారి విద్యార్హతల వెనుక ఉన్న నకిలీ వ్యవస్థలో మరెవరైనా ఉన్నారా? అనే అంశాలను కూడా అధికారులు పరిశీలించే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews
















