సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజలపై ధరల భారం పడకుండా చూస్తూనే రాష్ట్రం 15 శాతం వృద్ధిరేటు సాధించేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ప్రణాళిక విభాగం సమర్పించిన 2026 జులై నెల ఆర్థిక నివేదికను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి ప్రభుత్వ శాఖకు నిర్దేశించిన లక్ష్యాలను అత్యున్నత స్థాయిలో చేరుకునేలా అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించాలని అధికారులకు సూచించారు
వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే వ్యవసాయం, నీటి లభ్యత, ఉత్పత్తి, ధరలపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ముందుగానే కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లా, నియోజకవర్గం, మండలాల వారీగా నీటి లభ్యత, ఉత్పత్తుల విలువ జోడింపుపై కంటింజెన్సీ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
ఆర్థిక నివేదిక ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రాష్ట్రం 10.7 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. వాస్తవ వృద్ధిరేటు 9.9 శాతంగా నమోదైంది. గత రెండేళ్లుగా రాష్ట్రం జాతీయ సగటు కంటే మెరుగైన ఆర్థిక ప్రగతిని నమోదు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.
రంగాల వారీగా చూస్తే:
- వ్యవసాయ రంగం: 13.5% వృద్ధి
- పారిశ్రామిక రంగం: 10.6% వృద్ధి
- సేవల రంగం: 9.9% వృద్ధి
సాంకేతికతను అనుసంధానం చేయడం ద్వారా జీఎస్టీ వసూళ్లు 21 శాతం పెరిగి రూ.13,282 కోట్లకు చేరినట్లు నివేదిక వెల్లడించింది. సాధారణ ఎగుమతులు రూ.16,322 కోట్లకు చేరాయి.అదేవిధంగా ఎస్టీపీఐ ఎగుమతులు 32.2 శాతం, వాణిజ్య వాహనాల నమోదు 51.6 శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు
రాష్ట్రంలో చేపట్టిన భారీ పెట్టుబడి ప్రాజెక్టుల విషయంలోనూ పురోగతి నమోదైంది. మొత్తం రూ.2.88 లక్షల కోట్ల విలువైన మెగా ప్రాజెక్టుల పెట్టుబడుల గ్రౌండింగ్లో 75.4 శాతం పురోగతి సాధించినట్లు ఆర్థిక నివేదికలో పేర్కొన్నారు.వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూ ఆర్థిక వృద్ధిని కొనసాగించడంతో పాటు సామాన్య ప్రజలకు నిత్యావసర ధరల భారం పెరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews















