ఒకప్పుడు పోస్ట్‌మ్యాన్ సైకిల్ బెల్ వినిపిస్తే చాలు.. ఇంట్లో సందడి మొదలయ్యేది. ఎవరి కోసం ఉత్తరం వచ్చిందో, అందులో ఏం రాశారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. ఇప్పుడు మాత్రం ప్రపంచం మొత్తం చేతిలోని ఫోన్‌లోకి వచ్చేసింది. క్షణాల్లో సందేశాలు చేరిపోతున్నాయి. కానీ ఈ డిజిటల్ వేగానికి కాస్త విరామం ఇవ్వాలనుకుంటున్న జెన్‌జీ యువతలో పాతకాలపు ఉత్తరాలపై కొత్త ఆసక్తి మొదలైంది.
వాట్సాప్, ఈ-మెయిల్స్‌కు బదులుగా మనసులోని భావాలను కాగితంపై చేతిరాతతో రాసి పోస్టు చేయడం ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్‌గా మారుతోంది. వీటినే ‘స్నెయిల్ మెయిల్స్’ అని పిలుస్తున్నారు.
సాధారణ కాగితంపై రాసిన ఉత్తరానికి బదులుగా యువత తమ లేఖలను స్టిక్కర్లు, ఎండిన పూలు, అందమైన కవర్లు, ప్రత్యేకమైన చేతిరాతతో అలంకరిస్తున్నారు. స్నేహితులతో గడిపిన సరదా క్షణాలు, వ్యక్తిగత భావాలు, జ్ఞాపకాలను ఇలా ఉత్తరాల రూపంలో పంచుకుంటున్నారు.
ఫోన్ స్క్రీన్‌పై కనిపించే చిన్న సందేశానికి భిన్నంగా.. చేతితో రాసిన అక్షరాలను తాకడం, కవరును తెరవడం, అందులోని విషయాలను చదవడం ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తోందని యువత చెబుతోంది.
ఎప్పుడూ ఫోన్, సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోయే జీవితంలో ఈ ఉత్తరాలు కొంత ప్రశాంతతను ఇస్తున్నాయని జెన్‌జీ భావిస్తోంది. అందుకున్న లేఖలను ఆఫీస్ డెస్క్‌లలో, వ్యక్తిగత డైరీల్లో భద్రపరుచుకుంటూ వాటిని మళ్లీ మళ్లీ చదువుతున్నారు.
చిటికెలో చేరే డిజిటల్ సందేశాల కంటే.. కొంత సమయం తీసుకుని రాసిన ఉత్తరంలో ఉండే ఆప్యాయత, ఎదురుచూపు, వ్యక్తిగత స్పర్శే ఈ ట్రెండ్‌కు కారణంగా కనిపిస్తోంది. అందుకే పాతకాలపు ఉత్తరాలు ఇప్పుడు కొత్త తరానికి కొత్త అనుభూతిని అందిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















