దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరగడం, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించడం వంటి పరిణామాలు మదుపర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. దీంతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సెన్సెక్స్ 613 పాయింట్లు నష్టపోయి 77,540.94 వద్ద, నిఫ్టీ 190 పాయింట్లు దిగజారి 24,279 వద్ద కొనసాగుతున్నాయి.
టాటా షేర్లలో భారీ అమ్మకాలు: చంద్రశేఖరన్ నిర్ణయం నేపథ్యంలో టాటా గ్రూప్ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. టీసీఎస్ షేరు 4 శాతానికి పైగా పతనమై ఒక దశలో రూ.2,301.10 కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం 12.41 గంటల సమయంలో బీఎస్‌ఈలో రూ.2,332.35 వద్ద ట్రేడవుతోంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ షేరు కూడా సుమారు 4 శాతం నష్టపోయింది. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, టాటా పవర్ షేర్లు దాదాపు 2 శాతం చొప్పున క్షీణించాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















