ఒక సినిమా విజయవంతమైతే దాని వెనుక పనిచేసిన చిత్రబృందంతో పాటు ఎంతోమంది ప్రేక్షకుల్లో ఆనందం నిండుతుందని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కొరియన్ కనకరాజు’ విజయోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘కొరియన్ కనకరాజు’ విజయానికి దర్శకుడు మేర్లపాక గాంధీ ప్రధాన కారణమని పేర్కొన్నారు. యువతలో ఆదరణ పొందుతున్న కొరియన్ సంస్కృతి, ఆ నేపథ్యాన్ని తీసుకుని దానికి మనదైన కథను జోడించి సినిమాను రూపొందించడం మంచి ఆలోచన అని ప్రశంసించారు.
వరుణ్‌తేజ్ సినిమా ఎంపికలపై కూడా చిరంజీవి మాట్లాడారు. మొదటి నుంచీ ఇతర హీరోలకు భిన్నంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నంతో వరుణ్ సినిమాలు చేస్తున్నాడని అన్నారు. కేవలం కమర్షియల్ విజయాలు, వసూళ్ల కోసమే కాకుండా.. నటుడిగా తనను తాను నిరూపించుకునేలా ఆచితూచి అడుగులు వేస్తున్నాడని కొనియాడారు.
‘కొరియన్ కనకరాజు’ విజయం వరుణ్‌తేజ్ కెరీర్‌కు మరింత ఉత్సాహాన్నిస్తుందని చిరంజీవి ఆకాంక్షించారు. ఈ విజయాన్ని వరుణ్‌తేజ్ తన కుమారుడు వాయువ్‌తేజ్ ఖాతాలో వేయాలని సరదాగా వ్యాఖ్యానించారు. చిత్ర విజయానికి కృషి చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ఆయన అభినందించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















