నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. తల్లిదండ్రుల నుంచి డబ్బు రాబట్టేందుకు తనను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ నాటకం ఆడాడు. అయితే సెల్‌ఫోన్ సిగ్నల్స్ అతడి బండారాన్ని బయటపెట్టడంతో చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బందా జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఓం ప్రకాశ్ గౌరీ శంకర్ ఉద్యోగం కోసం పుణెకు వచ్చాడు. నెలలు గడిచినా ఉద్యోగం లభించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రుల నుంచి డబ్బు తీసుకునేందుకు కిడ్నాప్ డ్రామాకు తెరతీశాడు.
తనను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని, రూ.5 లక్షలు చెల్లిస్తేనే విడిచిపెడతారని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. వారిని నమ్మించేందుకు ఏడుస్తున్నట్లు ఓ వీడియోను కూడా చిత్రీకరించి పంపాడు. భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు వెంటనే ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
దీంతో యూపీ పోలీసులు పుణె పోలీసులకు సమాచారం అందించారు. ఆగస్టు 16న పుణె పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. పలు పోలీస్ స్టేషన్ల సిబ్బంది, నైట్ పెట్రోలింగ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఓం ప్రకాశ్ సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ట్రాక్ చేయగా ఓ హోటల్ సమీపంలో అతడి ఫోన్ ఉన్నట్లు గుర్తించారు.
పోలీసులు అక్కడికి చేరుకుని గాలించగా హోటల్ పరిసరాల్లో తిరుగుతున్న ఓం ప్రకాశ్ కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. డబ్బు కోసమే తాను కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















