తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రజలకు, పాల ఉత్పత్తిదారులకు, ఎమ్మెల్యేలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద కుటుంబాలకు అందించే వార్షిక బీమా కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఆదాయం, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ ఆవిన్ సేకరించే పాల ధరను కూడా పెంచారు. ప్రస్తుతం లీటరుకు రూ.38గా ఉన్న సేకరణ ధరను రూ.41కు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 3.16 లక్షలకుపైగా పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ పాల ఉత్పత్తిదారుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గత డీఎంకే ప్రభుత్వం పాల సేకరణ ధర పెంచేందుకు తగిన చర్యలు తీసుకోలేదని విజయ్ విమర్శించారు.
ఎమ్మెల్యేలకు కూడా ప్రభుత్వం తరఫున పలు సౌకర్యాలను కల్పించనున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించేలా ఎమ్మెల్యేలకు ప్రభుత్వ ఖర్చుతో కార్లను అందజేయనున్నట్లు తెలిపారు. వాహనాల నిర్వహణ, ఇంధనం, డ్రైవర్ జీతం కోసం ప్రతి నెలా రూ.75,000 ప్రత్యేక భత్యాన్ని మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.
అధికారిక పనుల కోసం ప్రతి ఎమ్మెల్యేకు కార్యదర్శిని నియమించుకునేందుకు నెలకు రూ.25,000 గ్రాంట్ కూడా అందించనున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం, పాల ఉత్పత్తిదారులకు మద్దతు, ఎమ్మెల్యేలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం ద్వారా పరిపాలనను మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















