నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె.రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ దారుణానికి అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. డబ్బులు దోచుకునేందుకే ఈ హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
ఈ నెల 11న కొండమల్లేపల్లి మండలంలోని వేర్వేరు తండాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ముఖాలను మాస్క్, హుడీలతో కప్పుకుని రూపారెడ్డి ఇంటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో ఒక విద్యార్థి ఇంట్లోకి వెళ్లి డబ్బులు ఇవ్వాలని ఆమెను బెదిరించాడు. అయితే రూపారెడ్డి ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ క్రమంలో విద్యార్థి ధరించిన మాస్క్ తొలగిపోవడంతో రూపారెడ్డి అతడిని గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమె కేకలు వేయడంతో తన గుర్తింపు బయటపడుతుందనే భయంతో వెంట తీసుకెళ్లిన కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అనంతరం ఇంట్లో ఉన్న రూ.2.20 లక్షల నగదును తీసుకుని బయటకు వచ్చాడు. అందులో నుంచి మరో విద్యార్థికి రూ.40 వేలు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఇద్దరు విద్యార్థులు గతంలోనూ చోరీలకు పాల్పడుతూ జల్సాలకు అలవాటు పడినట్లు పోలీసులు గుర్తించారు.
విచారణ సందర్భంగా ఒక విద్యార్థి వద్ద నుంచి రూ.1.60 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదుపై రక్తపు మరకలు ఉండటంతో అనుమానం మరింత బలపడింది. రక్తపు మరకలపై పోలీసులు ప్రశ్నించడంతో విద్యార్థులు చివరకు జరిగిన విషయాన్ని అంగీకరించినట్లు సమాచారం.
ప్రిన్సిపల్ హత్యకు దారితీసిన కారణాలు, విద్యార్థుల గత నేరచరిత్ర, ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















