రాష్ట్రంలో బధిర విద్యార్థుల కోసం తొలి డిగ్రీ కళాశాల బాపట్ల జిల్లాలో ప్రారంభమైంది. వెదుళ్లపల్లిలోని బధిరుల ఆశ్రమ పాఠశాల, జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న తాత్కాలిక భవనాల్లో డిగ్రీ కళాశాల కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. బధిర విద్యార్థులకు డిగ్రీ విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కళాశాలను ఏర్పాటు చేశారు.
గత నెల 22న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వెదుళ్లపల్లిలో బధిరుల కోసం డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. తొలి ఏడాది బీకాం కంప్యూటర్స్ కోర్సును 30 సీట్లతో ప్రారంభిస్తున్నారు. ప్రవేశాల ప్రక్రియకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
కళాశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు అధ్యాపకుల నియామక ప్రక్రియను కూడా చేపడుతున్నారు. బధిర విద్యార్థులకు చదువుతోపాటు ఇతర అవసరాలకు ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది.
బీకాం కంప్యూటర్స్‌లో చేరే బధిర విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రజియా తెలిపారు. పాఠ్య, రాత పుస్తకాలతోపాటు కాస్మెటిక్స్ ఖర్చుల కోసం నగదు, అవసరమైన వినికిడి పరికరాలు అందజేస్తామని చెప్పారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్యను కొనసాగించేందుకు అవకాశం లభించనుంది.
సంబంధిత ధ్రువపత్రాలతో విద్యార్థులు కళాశాలకు వచ్చి ప్రవేశాలు పొందాలని ప్రిన్సిపల్ సూచించారు. ప్రవేశాలు, ఇతర వివరాల కోసం 90000 13633 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని బధిర విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















