ఉద్యాన హబ్ ద్వారా కేవలం పంటల సాగుకే పరిమితం కాకుండా.. రైతుకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఒకే వ్యవస్థలోకి తీసుకురానున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాతోపాటు సూక్ష్మసేద్యం, ఆధునిక సాగు పద్ధతులు, యాంత్రీకరణ, పంట కోత అనంతర నిర్వహణపై దృష్టి పెడతారు. దిగుబడుల నాణ్యత పెంచి అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ఉత్పత్తులను తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టనున్నారు.
ఉద్యాన పంటలకు ఏడాది పొడవునా నీటి లభ్యత ఉండేలా ఆయకట్టు స్థిరీకరణ, అదనపు ఆయకట్టు కల్పనకు ప్రాధాన్యం ఇస్తారు. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల అభివృద్ధితోపాటు అవసరమైన ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని అందించనున్నారు. దీంతో వర్షాధార ప్రాంతాల్లోనూ ఉద్యాన పంటల విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.
ఉత్పత్తి చేసిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం కూడా ప్రణాళికలో కీలక భాగం. పొలాల నుంచి మార్కెట్లు, ప్రాసెసింగ్ యూనిట్లకు అనుసంధాన రహదారులు నిర్మించనున్నారు. పంట కోత అనంతరం నిల్వ, గ్రేడింగ్, ప్యాకింగ్, శీతల గిడ్డంగులు, ఆహారశుద్ధి వంటి రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించనున్నారు. దీనివల్ల రైతులు ముడి ఉత్పత్తుల విక్రయానికే పరిమితం కాకుండా విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
ఒక్కో క్లస్టర్‌ను ప్రత్యేక పంటలు, స్థానిక వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా అభివృద్ధి చేయనున్నారు. మామిడి, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, జామ, అరటి, బొప్పాయి వంటి సంప్రదాయ పంటలతోపాటు ఆపిల్, అవకాడో, అంజూర, మిరియాలు తదితర అధిక విలువ కలిగిన పంటల సాగును ప్రోత్సహించనున్నారు. దీంతో ప్రాంతాల వారీగా ప్రత్యేక ఉద్యాన ఉత్పత్తి కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశం ఉంది.
రూ.60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు రావడం ద్వారా ఆహారశుద్ధి, నిల్వ, ప్యాకింగ్, కోల్డ్‌చెయిన్, లాజిస్టిక్స్ రంగాల్లో భారీగా పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఊతం లభించడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. రైతులకు స్థానికంగానే మార్కెట్ సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల రవాణా, మధ్యవర్తిత్వ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















