అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న యువతికి సినీ హీరో రామ్ పోతినేని అండగా నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన శశిభవ్యత(18) పరిస్థితిపై మీడియాలో వచ్చిన కథనాలను తెలుసుకున్న రామ్.. వెంటనే స్పందించారు. బుధవారం ఆమెతో వీడియో కాల్‌లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులతోనూ మాట్లాడి ధైర్యం చెప్పారు.
శశిభవ్యత ‘లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ’ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోంది. తరచూ ఫిట్స్ రావడంతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో మంచానికే పరిమితమైంది. మతిస్థిమితం సరిగా లేకపోయినా రామ్ పేరు చెబితే ఆమె ఉత్సాహంగా స్పందిస్తోంది. దీంతో తల్లిదండ్రులు ఆయన సినిమాలు, ఫొటోలు, వీడియోలు చూపిస్తూ ఆమెకు అన్నం తినిపించడం, మందులు వేయించడం చేస్తున్నారు.
శశిభవ్యతకు సంబంధించిన వైద్య నివేదికలు తనకు అందాయని రామ్ తెలిపారు. ఆమెకు అవసరమైన మందులు, ఇతర ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు. సరైన సమయానికి మందులు వేయించాలని, ఆమెను సంతోషంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. తమ కుమార్తె పరిస్థితిని తెలుసుకుని స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడటంతో పాటు ఆర్థికంగా అండగా ఉంటానని రామ్ చెప్పడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
శశిభవ్యత పరిస్థితిని వెలుగులోకి తీసుకొచ్చిన మీడియా సంస్థలు, అభిమానులు, సామాజిక మాధ్యమాల ఇన్‌ఫ్లుయెన్సర్లకు రామ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారి ద్వారా తన దృష్టికి ఈ విషయం వచ్చిందని పేర్కొన్నారు. తమ అభిమాన నటుడు స్పందించి తమకు భరోసా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని శశిభవ్యత తల్లిదండ్రులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















