ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), జోధ్‌పుర్.. వివిధ విభాగాల్లో 190 గ్రూప్-ఏ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది.
పోస్టుల వివరాలు:
- ప్రొఫెసర్ – 34
- అడిషనల్ ప్రొఫెసర్ – 17
- అసోసియేట్ ప్రొఫెసర్ – 26
- అసిస్టెంట్ ప్రొఫెసర్ – 113
అర్హతలు:
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ, ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, ఎంబీబీఎస్, పీహెచ్డీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. దీనితో పాటు సంబంధిత రంగంలో కనీస బోధన లేదా పరిశోధన అనుభవం అవసరం. పోస్టును బట్టి అర్హతలు, అనుభవ నిబంధనలు మారవచ్చు.
వయోపరిమితి:
పోస్టును అనుసరించి గరిష్ఠ వయసు 50 నుంచి 58 ఏళ్ల మధ్య ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం:
- ప్రొఫెసర్ – రూ.1,68,900
- అడిషనల్ ప్రొఫెసర్ – రూ.1,48,200
- అసోసియేట్ ప్రొఫెసర్ – రూ.1,38,300
- అసిస్టెంట్ ప్రొఫెసర్ – రూ.1,01,500
ఎంపిక విధానం:
అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేపడతారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.3,000. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200గా నిర్ణయించారు.
చివరి తేదీ:
ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబరు 12, 2026లోగా సమర్పించాలి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















