ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

డీపీ మార్చి యజమానిలా ఫోన్‌.. అకౌంటెంట్‌తో రూ.కోటి బదిలీ చేయించిన కేటుగాళ్లు

August 20, 2026
in Crime News, News
0
డీపీ మార్చి యజమానిలా ఫోన్‌.. అకౌంటెంట్‌తో రూ.కోటి బదిలీ చేయించిన కేటుగాళ్లు

డీపీ మార్చి యజమానిలా ఫోన్‌.. అకౌంటెంట్‌తో రూ.కోటి బదిలీ చేయించిన కేటుగాళ్లు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

సైబర్‌ మోసగాళ్లు యజమాని డీపీని ఉపయోగించి అకౌంటెంట్‌ను నమ్మించి రూ.కోటి బదిలీ చేయించిన ఘటన సైబరాబాద్‌లో వెలుగుచూసింది. అయితే బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు వేగంగా స్పందించి కేవలం 10 రోజుల్లోనే మొత్తం నగదును రికవరీ చేశారు.

హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో ఓ రిటైల్‌ చీరల దుకాణంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తికి ఈ నెల 4న యజమాని డీపీతో వాట్సప్‌ కాల్‌ వచ్చింది. వ్యాపార లావాదేవీలో భాగంగా తాను సూచించిన బ్యాంకు ఖాతాలో రూ.కోటి జమ చేయాలని అవతలి వ్యక్తి ఆదేశించాడు. ఫోన్‌ చేసింది యజమానే అనుకున్న అకౌంటెంట్‌ ఎలాంటి అనుమానం లేకుండా నగదును బదిలీ చేశాడు.

అయితే నగదు బదిలీ అయిన వెంటనే యజమాని ఫోన్‌కు బ్యాంకు నుంచి సందేశం రావడంతో ఆయన అకౌంటెంట్‌ను సంప్రదించారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. తాను ఎలాంటి నగదు బదిలీ చేయమని చెప్పలేదని యజమాని స్పష్టం చేయడంతో సైబర్‌ మోసం జరిగినట్లు గుర్తించారు.

వెంటనే బాధితుడు 1930 నంబర్‌కు, సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ రవీందర్‌రెడ్డి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ మన్‌మోహన్‌ బృందం దర్యాప్తు ప్రారంభించింది. నగదు జమ చేసిన బ్యాంకు ఖాతాను స్తంభింపజేసి, లావాదేవీల ఆధారంగా నిందితుల వివరాలను సేకరించారు.దర్యాప్తులో ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన దీపక్‌కుమార్‌ (37) ఈ మోసం వెనుక కీలక నిందితుడిగా గుర్తించారు. అతడితో పాటు అంజు, ఆకాశ్‌ కలిసి సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

కొల్లగొట్టిన నగదును జమ చేసేందుకు కరెంట్‌ ఖాతా అవసరం కావడంతో దీపక్‌కుమార్‌ను తమతో కలుపుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురూ కలిసి రూ.600 కోట్ల టర్నోవర్‌తో వెల్‌నెస్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి లఖ్‌నవూలోని ఓ బ్యాంకులో కరెంట్‌ ఖాతా తెరిచినట్లు వెల్లడించారు.

ఎంపిక చేసిన వ్యక్తుల ఫోన్లకు లింకులు పంపి ఏపీకే ఫైళ్లను ఇన్‌స్టాల్‌ చేయించడం ద్వారా సొమ్ము కొల్లగొట్టే విధానాన్ని ముఠా అనుసరించినట్లు పోలీసులు తెలిపారు. కాజేసిన నగదులో 30 శాతం దీపక్‌కుమార్‌కు ఇవ్వగా.. మిగిలిన 70 శాతాన్ని అంజు, ఆకాశ్‌ పంచుకునేవారని వివరించారు.

ఈ కేసులో ఫోన్‌ నంబర్‌, బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా దీపక్‌కుమార్‌ను గుర్తించిన పోలీసులు ఈ నెల 8న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.

బ్యాంకు సహకారం, న్యాయస్థానం ఆదేశాలతో బాధితుడు కోల్పోయిన రూ.కోటి మొత్తాన్ని కేవలం 10 రోజుల్లోనే పూర్తిగా రికవరీ చేసి తిరిగి అందించినట్లు సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. సైబర్‌ నేరంలో 100 శాతం నగదును రికవరీ చేసిన ఘటనగా దీన్ని పేర్కొన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: 1930 Cyber HelplineCash RecoveryCyber CrimeCyber CriminalsCyber Fraudcyber securitycyberabad policeDigital FraudHyderabad CrimeOnline ScamshivasakthimediashivasakthinewsUP Cyber FraudWhatsApp Fraud
ShareTweetSend
Previous Post

అమ్మానాన్నలే.. మళ్లీ పెళ్లి చేసుకున్నారు!

Next Post

బిడ్డ పుట్టిన తర్వాత పొట్ట తగ్గాలంటే.. ఇలా చేయండి

Related Posts

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు
India News

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు
Technology News

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు
Devotional News

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

August 24, 2026
జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌
Sports News

జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

August 24, 2026
నిశ్శబ్దంపై అద్భుత సమాధానం.. 19 ఏళ్ల కాజియాకు మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటం
India News

నిశ్శబ్దంపై అద్భుత సమాధానం.. 19 ఏళ్ల కాజియాకు మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటం

August 24, 2026
టాక్సిక్‌’కు భారీ క్రేజ్‌.. 5.55 లక్షల టికెట్లు సేల్‌.. రూ.30 కోట్లు దాటిన బుకింగ్స్‌
Movies

‘టాక్సిక్‌’కు భారీ క్రేజ్‌.. 5.55 లక్షల టికెట్లు సేల్‌.. రూ.30 కోట్లు దాటిన బుకింగ్స్‌

August 24, 2026
Next Post
బిడ్డ పుట్టిన తర్వాత పొట్ట తగ్గాలంటే.. ఇలా చేయండి

బిడ్డ పుట్టిన తర్వాత పొట్ట తగ్గాలంటే.. ఇలా చేయండి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 24, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

August 24, 2026
జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

August 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.