సైబర్ మోసగాళ్లు యజమాని డీపీని ఉపయోగించి అకౌంటెంట్‌ను నమ్మించి రూ.కోటి బదిలీ చేయించిన ఘటన సైబరాబాద్‌లో వెలుగుచూసింది. అయితే బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు వేగంగా స్పందించి కేవలం 10 రోజుల్లోనే మొత్తం నగదును రికవరీ చేశారు.
హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో ఓ రిటైల్ చీరల దుకాణంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తికి ఈ నెల 4న యజమాని డీపీతో వాట్సప్ కాల్ వచ్చింది. వ్యాపార లావాదేవీలో భాగంగా తాను సూచించిన బ్యాంకు ఖాతాలో రూ.కోటి జమ చేయాలని అవతలి వ్యక్తి ఆదేశించాడు. ఫోన్ చేసింది యజమానే అనుకున్న అకౌంటెంట్ ఎలాంటి అనుమానం లేకుండా నగదును బదిలీ చేశాడు.
అయితే నగదు బదిలీ అయిన వెంటనే యజమాని ఫోన్‌కు బ్యాంకు నుంచి సందేశం రావడంతో ఆయన అకౌంటెంట్‌ను సంప్రదించారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. తాను ఎలాంటి నగదు బదిలీ చేయమని చెప్పలేదని యజమాని స్పష్టం చేయడంతో సైబర్ మోసం జరిగినట్లు గుర్తించారు.
వెంటనే బాధితుడు 1930 నంబర్‌కు, సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ రవీందర్‌రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ మన్మోహన్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. నగదు జమ చేసిన బ్యాంకు ఖాతాను స్తంభింపజేసి, లావాదేవీల ఆధారంగా నిందితుల వివరాలను సేకరించారు.దర్యాప్తులో ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన దీపక్‌కుమార్ (37) ఈ మోసం వెనుక కీలక నిందితుడిగా గుర్తించారు. అతడితో పాటు అంజు, ఆకాశ్ కలిసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
కొల్లగొట్టిన నగదును జమ చేసేందుకు కరెంట్ ఖాతా అవసరం కావడంతో దీపక్‌కుమార్‌ను తమతో కలుపుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురూ కలిసి రూ.600 కోట్ల టర్నోవర్‌తో వెల్నెస్ కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి లఖ్‌నవూలోని ఓ బ్యాంకులో కరెంట్ ఖాతా తెరిచినట్లు వెల్లడించారు.
ఎంపిక చేసిన వ్యక్తుల ఫోన్లకు లింకులు పంపి ఏపీకే ఫైళ్లను ఇన్స్టాల్ చేయించడం ద్వారా సొమ్ము కొల్లగొట్టే విధానాన్ని ముఠా అనుసరించినట్లు పోలీసులు తెలిపారు. కాజేసిన నగదులో 30 శాతం దీపక్‌కుమార్‌కు ఇవ్వగా.. మిగిలిన 70 శాతాన్ని అంజు, ఆకాశ్ పంచుకునేవారని వివరించారు.
ఈ కేసులో ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా దీపక్‌కుమార్‌ను గుర్తించిన పోలీసులు ఈ నెల 8న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
బ్యాంకు సహకారం, న్యాయస్థానం ఆదేశాలతో బాధితుడు కోల్పోయిన రూ.కోటి మొత్తాన్ని కేవలం 10 రోజుల్లోనే పూర్తిగా రికవరీ చేసి తిరిగి అందించినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. సైబర్ నేరంలో 100 శాతం నగదును రికవరీ చేసిన ఘటనగా దీన్ని పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















