అమెరికాలో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని సుమారు 7.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.71 కోట్లు) మోసం చేసిన కేసులో భారతీయుడు సునీల్ భారతి గోస్వామి అరెస్టయ్యాడు. న్యూజెర్సీలో నివసించే గోస్వామి.. ఈ మోసాల వెనుక ఉన్న ముఠాకు ‘మనీ మ్యూల్’గా పనిచేసినట్లు అమెరికా అధికారులు ఆరోపించారు.
అధికారుల వివరాల ప్రకారం.. గోస్వామి వృద్ధులకు ఫోన్ చేసి తాను పోలీసు లేదా ప్రభుత్వ అధికారినని పరిచయం చేసుకునేవాడు. అనంతరం వారిని వివిధ రకాలుగా బెదిరించి నగదు, బంగారం తీసుకునేవాడు. ఇలా న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో కనీసం తొమ్మిది మంది వృద్ధుల నుంచి సొమ్ము వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ నగదు, విలువైన వస్తువులను ముఠాలోని ఇతర సభ్యులకు అందించేవాడని అధికారులు తెలిపారు.
అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలు :
2025 ఆగస్టు నుంచి 2026 ఏప్రిల్ మధ్య గోస్వామి తన బ్యాంకు ఖాతాలో 90 వేల డాలర్లకు పైగా నగదు జమ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ లావాదేవీలపై అనుమానం రావడంతో దర్యాప్తు ప్రారంభించగా.. వృద్ధులను లక్ష్యంగా చేసుకున్న మోసంతో అతనికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ వ్యవహారంలో గోస్వామిపై పలు కేసులు నమోదు చేశారు. ఆగస్టు 17న అమెరికా కోర్టులో హాజరైన అతడికి షరతులతో కూడిన బెయిల్ లభించింది. అయితే మరుసటి రోజే అతడు కెనడాకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
దోహా వెళ్లేలోపే అరెస్టు :
కెనడాలోని టొరంటో నుంచి దోహా వెళ్లేందుకు గోస్వామి సిద్ధమవుతున్న సమయంలో అమెరికా అభ్యర్థన మేరకు కెనడా అధికారులు ఆగస్టు 20న అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని అమెరికాకు అప్పగించే ప్రక్రియపై చర్యలు కొనసాగుతున్నాయి.ఈ కేసులో నేరాలు రుజువైతే గోస్వామికి గరిష్ఠంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, కేసులో ఆరోపణలు కోర్టులో నిరూపించాల్సి ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















