ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

చదువుకు అనుకూలంగా.. సకల సౌకర్యాలతో ఎస్సీ హాస్టళ్లు

August 24, 2026
in Andhra Pradesh News, News
0
చదువుకు అనుకూలంగా.. సకల సౌకర్యాలతో ఎస్సీ హాస్టళ్లు

చదువుకు అనుకూలంగా.. సకల సౌకర్యాలతో ఎస్సీ హాస్టళ్లు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పాత వసతిగృహాల్లో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపుతూ కొత్త భవనాలను నిర్మిస్తోంది. విశాలమైన గదులతోపాటు ప్రత్యేక స్టడీ రూములు, డైనింగ్‌ హాళ్లు, వంటగదులు, స్నానపు గదులు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను కొత్త హాస్టళ్లలో ఏర్పాటు చేస్తున్నారు.

గతంలో పలు వసతిగృహాలు ఇరుకు గదులు, శిథిలావస్థకు చేరిన భవనాలు, సరిపోని మరుగుదొడ్లు, స్నానపు గదులు వంటి సమస్యలతో కొనసాగాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్త భవన సముదాయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 25 ఎస్సీ వసతిగృహాలను గుర్తించి పీఎం అజయ్‌ పథకం కింద రూ.86 కోట్ల నిధులను సమీకరించింది. ఒక్కో హాస్టల్‌ నిర్మాణానికి స్థలం, విద్యార్థుల సంఖ్య, అవసరమైన సౌకర్యాలను బట్టి రూ.3 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు.

ఇప్పటికే గజపతినగరం, రాయదుర్గం పరిధిలోని కణేకల్లు, పామర్రు, ప్రొద్దుటూరు, కలసపాడు, నందికొట్కూరులోని ఆరు హాస్టళ్ల భవనాలు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన హాస్టళ్లలో పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. సెప్టెంబరు చివరి నాటికి వీటిలో 18 భవనాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

కృష్ణా జిల్లా మొవ్వలో మాత్రం కోర్టు కేసు కారణంగా హాస్టల్‌ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. న్యాయపరమైన సమస్య పరిష్కారమైన తర్వాత అక్కడి పనులు తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది.

నంద్యాల జిల్లా నందికొట్కూరులో నిర్మించిన ఎస్సీ బాలికల వసతిగృహాన్ని 50 సెంట్ల స్థలంలో ఏర్పాటు చేశారు. ఇందులో 150 మంది విద్యార్థినులకు సరిపడే గదులతోపాటు కిచెన్‌, డైనింగ్‌ హాల్‌, స్టడీ రూమ్‌ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలో గతంలో మూసివేసిన ఎస్సీ బాలికల హాస్టల్‌ స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించడం మరో ప్రత్యేకత. పాత హాస్టల్‌లో పరిమిత సౌకర్యాలు ఉండటంతో అప్పట్లో దాన్ని మూసివేశారు. ప్రస్తుతం రూ.3 కోట్లతో నిర్మిస్తున్న కొత్త భవనంలో 120 మంది విద్యార్థినులకు వసతి కల్పించేలా ఆరు విశాలమైన గదులు, భోజనశాల, వంటగది, వార్డెన్‌ క్వార్టర్‌, మెడికల్‌ గది, మరుగుదొడ్లు, స్నానపు గదులను ఏర్పాటు చేస్తున్నారు.

విశాఖపట్నంలోని మహారాణిపేట, భీమునిపట్నంలోని కుమ్మరిపాలెం, ఎస్‌.కోట, పార్వతీపురం, మైలవరం, విస్సన్నపేట, గుండుగొలను, అమృతలూరు, మాచర్ల, ఒంగోలు, యర్రగొండపాలెం, గూడూరు, కృష్ణగిరి, ఆత్మకూరు, పలమనేరు, మనుబోలు, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో నిర్మిస్తున్న హాస్టళ్లు కూడా పూర్తయిన తర్వాత విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AmaravatiAndhra pradeshAndhra Pradesh EducationAP governmentEducationGovernment HostelsHostelsPM Ajay SchemeSC HostelsSC StudentsSC Welfareshivasakthi newsshivasakthimediaSocial WelfareStudent Hostelsstudent welfare
ShareTweetSend
Previous Post

తిరుమలలో పవిత్రోత్సవాల సందడి.. వైదిక కార్యక్రమాలతో ప్రారంభం

Next Post

మోదీ-ట్రంప్‌ మీడియా భేటీపై అమెరికా రాయబారి సంచలన వ్యాఖ్యలు

Related Posts

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు
Education

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

August 25, 2026
వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’
World News

వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

August 25, 2026
2,300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు.. దిల్లీ సర్కారు కీలక సమీక్ష
India News

2,300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు.. దిల్లీ సర్కారు కీలక సమీక్ష

August 25, 2026
పన్ను తగ్గిస్తామని రూ.లక్ష డిమాండ్‌.. రూ.50 వేలకు బేరం
Crime News

పన్ను తగ్గిస్తామని రూ.లక్ష డిమాండ్‌.. రూ.50 వేలకు బేరం

August 25, 2026
విధులకు వెళ్లేందుకు ప్రాణాలతో చెలగాటం.. నదిలో ఈదుకుంటూ పాఠశాలకు
India News

విధులకు వెళ్లేందుకు ప్రాణాలతో చెలగాటం.. నదిలో ఈదుకుంటూ పాఠశాలకు

August 25, 2026
ఆశతో ఎదిగిన రైతు
Telugu Stories

ఆశతో ఎదిగిన రైతు

August 25, 2026
Next Post
మోదీ-ట్రంప్‌ మీడియా భేటీపై అమెరికా రాయబారి సంచలన వ్యాఖ్యలు

మోదీ-ట్రంప్‌ మీడియా భేటీపై అమెరికా రాయబారి సంచలన వ్యాఖ్యలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

August 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

August 25, 2026
వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

August 25, 2026
2,300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు.. దిల్లీ సర్కారు కీలక సమీక్ష

2,300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు.. దిల్లీ సర్కారు కీలక సమీక్ష

August 25, 2026
పన్ను తగ్గిస్తామని రూ.లక్ష డిమాండ్‌.. రూ.50 వేలకు బేరం

పన్ను తగ్గిస్తామని రూ.లక్ష డిమాండ్‌.. రూ.50 వేలకు బేరం

August 25, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ ఆహ్వానం.. ఉన్నత చదువులకు ఎన్నో అవకాశాలు

August 25, 2026
వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

వాషింగ్టన్‌ ఆంక్షలకు టెహ్రాన్‌ సవాల్‌.. ‘మా సంకల్పాన్ని పరీక్షించలేరు’

August 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.