రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పాత వసతిగృహాల్లో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపుతూ కొత్త భవనాలను నిర్మిస్తోంది. విశాలమైన గదులతోపాటు ప్రత్యేక స్టడీ రూములు, డైనింగ్ హాళ్లు, వంటగదులు, స్నానపు గదులు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను కొత్త హాస్టళ్లలో ఏర్పాటు చేస్తున్నారు.
గతంలో పలు వసతిగృహాలు ఇరుకు గదులు, శిథిలావస్థకు చేరిన భవనాలు, సరిపోని మరుగుదొడ్లు, స్నానపు గదులు వంటి సమస్యలతో కొనసాగాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్త భవన సముదాయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 25 ఎస్సీ వసతిగృహాలను గుర్తించి పీఎం అజయ్ పథకం కింద రూ.86 కోట్ల నిధులను సమీకరించింది. ఒక్కో హాస్టల్ నిర్మాణానికి స్థలం, విద్యార్థుల సంఖ్య, అవసరమైన సౌకర్యాలను బట్టి రూ.3 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు.
ఇప్పటికే గజపతినగరం, రాయదుర్గం పరిధిలోని కణేకల్లు, పామర్రు, ప్రొద్దుటూరు, కలసపాడు, నందికొట్కూరులోని ఆరు హాస్టళ్ల భవనాలు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన హాస్టళ్లలో పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. సెప్టెంబరు చివరి నాటికి వీటిలో 18 భవనాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
కృష్ణా జిల్లా మొవ్వలో మాత్రం కోర్టు కేసు కారణంగా హాస్టల్ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. న్యాయపరమైన సమస్య పరిష్కారమైన తర్వాత అక్కడి పనులు తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది.
నంద్యాల జిల్లా నందికొట్కూరులో నిర్మించిన ఎస్సీ బాలికల వసతిగృహాన్ని 50 సెంట్ల స్థలంలో ఏర్పాటు చేశారు. ఇందులో 150 మంది విద్యార్థినులకు సరిపడే గదులతోపాటు కిచెన్, డైనింగ్ హాల్, స్టడీ రూమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలో గతంలో మూసివేసిన ఎస్సీ బాలికల హాస్టల్ స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించడం మరో ప్రత్యేకత. పాత హాస్టల్‌లో పరిమిత సౌకర్యాలు ఉండటంతో అప్పట్లో దాన్ని మూసివేశారు. ప్రస్తుతం రూ.3 కోట్లతో నిర్మిస్తున్న కొత్త భవనంలో 120 మంది విద్యార్థినులకు వసతి కల్పించేలా ఆరు విశాలమైన గదులు, భోజనశాల, వంటగది, వార్డెన్ క్వార్టర్, మెడికల్ గది, మరుగుదొడ్లు, స్నానపు గదులను ఏర్పాటు చేస్తున్నారు.
విశాఖపట్నంలోని మహారాణిపేట, భీమునిపట్నంలోని కుమ్మరిపాలెం, ఎస్.కోట, పార్వతీపురం, మైలవరం, విస్సన్నపేట, గుండుగొలను, అమృతలూరు, మాచర్ల, ఒంగోలు, యర్రగొండపాలెం, గూడూరు, కృష్ణగిరి, ఆత్మకూరు, పలమనేరు, మనుబోలు, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో నిర్మిస్తున్న హాస్టళ్లు కూడా పూర్తయిన తర్వాత విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















