రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాధిక్‌ఖాన్‌పై సామూహిక ఆత్మహత్య ఘటనలో ప్రాణాలతో బయటపడిన చిన్నారి రియాన్స్ కార్తికేయరెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు. సాధిక్ తన తల్లిని తరచూ వేధించేవాడని, కొట్టేవాడని, విషయం బయటకు చెబితే టెర్రరిస్టులకు అప్పగిస్తానంటూ బెదిరించేవాడని రియాన్స్ తెలిపాడు.
కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మంగళవారం రియాన్స్‌ను జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వద్దకు తీసుకెళ్లారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రియాన్స్.. తాను ఆరో తరగతి చదువుతున్నానని, రైఫిల్ షూటింగ్ అంటే ఇష్టమని చెప్పాడు. మూడో తరగతి చదువుతున్న సమయంలో స్కూల్‌లో షూటింగ్ శిక్షణ ఇస్తామని చెప్పి సాధిక్ తన ఫోన్ నంబర్ ఇచ్చాడని వివరించాడు.
ఆ పరిచయం తర్వాత సాధిక్ తమ కుటుంబంతో సన్నిహితంగా మారాడని, అనంతరం తన తల్లిని హింసించడం మొదలుపెట్టాడని రియాన్స్ ఆరోపించాడు. తన తండ్రి ఫిజియోథెరపీ సెంటర్‌లో ఉన్న సమయంలో సాధిక్ వచ్చి ప్రొటీన్‌లో ఏదో రసాయనం కలిపి చంపేశాడని ఆరోపించాడు. తన కుటుంబానికి జరిగిన ఘటనపై సాధిక్‌కు కఠిన శిక్ష విధించాలని కోరాడు.
ఒకే కుటుంబంలో నలుగురి మరణాలకు కారణమైన సాధిక్‌ఖాన్‌కు ఉరి శిక్ష విధించాలని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఘటనపై అనేక తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వస్తున్నందున సమగ్ర దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. కేసును సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. ఈ విషయంపై ప్రధాని, ముఖ్యమంత్రి, కేంద్ర హోంమంత్రికి ప్రజలు లేఖలు రాయాలని పిలుపునిచ్చారు.
ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న సాధిక్‌ను వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని సర్పవరం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు ఉపయోగించినట్లు చెబుతున్న విష పదార్థం, ఇంజెక్షన్లకు సంబంధించిన వివరాలను రాబట్టాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు సాధిక్ ప్రయత్నించాడన్న ఆరోపణలపైనా దర్యాప్తు చేయాల్సి ఉందని తెలిపారు.
మరోవైపు నూకరాజు కుటుంబం, జగదీశ్వరరెడ్డికి సంబంధించిన ఆస్తులపై గత రెండేళ్లలో జరిగిన లావాదేవీల వివరాలను అందించాలని కోరుతూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. ఆస్తుల బదలాయింపులు, విక్రయాలు లేదా ఇతర లావాదేవీలు జరిగాయా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















