కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆ పార్టీ నేత, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో కలిసి కొండా మురళి ప్రజాభవన్‌లో సమావేశమయ్యారు. దీంతో ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
సమావేశం అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖకు సంబంధించిన అంశంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై భేటీలో ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు.
తమ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కొండా మురళి స్పష్టం చేశారు. ఆమె ప్లాన్-ఎ ప్రకారం వ్యాఖ్యలు చేసిందని, అయితే ప్లాన్-బి ఏమిటో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మంత్రి కొండా సురేఖ తన అధికారిక కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొంటున్నారని మురళి తెలిపారు. మంగళవారం వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. బుధవారం కూడా మరో కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఈ అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని కొండా మురళి స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానంపై తమకు పూర్తి నమ్మకం ఉందని మరోసారి పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















