కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉద్యోగ విధుల్లోనూ రాణిస్తున్న మహిళలు ఎందరో. ముఖ్యంగా పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు వారికి సంరక్షణ కల్పిస్తూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం మరింత సవాల్‌తో కూడుకున్న విషయం. అలాంటి పరిస్థితుల్లోనూ విధులకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్న ఓ టీచర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అస్సాంకు చెందిన రూమీ డేకా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. 2027 జనగణనలో భాగంగా ఆమెకు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించే బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో తన ఇద్దరు చిన్నారులను వెంట తీసుకెళ్లి విధులు నిర్వర్తించారు. ఒక బిడ్డను చంకలో ఎత్తుకుని, మరో చిన్నారిని చేతిలో పట్టుకుని ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్న దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
దేశంలో 15 ఏళ్ల విరామం తర్వాత జనగణన నిర్వహిస్తున్నారు. 2027 మార్చి 1 నాటికి జనగణన ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి జనాభా లెక్కలతో పాటు కుల గణనను కూడా నిర్వహిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















