మీలో ఏదైనా ప్రత్యేక నైపుణ్యం ఉందా? దాన్ని ప్రదర్శించేందుకు సరైన వేదిక కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ ప్రతిభకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం ‘ఇండియా స్కిల్స్ 2026-27’ ద్వారా లభించనుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ పోటీల్లో సంప్రదాయ విద్యార్హతలకంటే ప్రాక్టికల్ నైపుణ్యాలకు ప్రాధాన్యం ఉంటుంది.
యువతలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, దానికి మరింత పదును పెట్టడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశం. నైపుణ్యాల ఆధారంగా కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే వారికి ఇది మంచి వేదికగా నిలుస్తుంది. ప్రతిభ చూపిన వారికి పతకాలు, బహుమతులతో పాటు ప్రత్యేక శిక్షణ, గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది.
63 నైపుణ్య విభాగాల్లో అవకాశం :
‘ఇండియా స్కిల్స్ 2026-27’లో మొత్తం 63 నైపుణ్య విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, కన్‌స్ట్రక్షన్, ఇంజినీరింగ్, డిజిటల్ టెక్నాలజీస్, హాస్పిటాలిటీ, ట్రాన్స్‌పోర్టేషన్, క్రియేటివ్ ఇండస్ట్రీస్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్ సిస్టమ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వాటర్ టెక్నాలజీ, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, ఐసీటీ నెట్‌వర్క్, డిజైన్ టెక్నాలజీ తదితర రంగాల్లో యువత తమ ప్రతిభను పరీక్షించుకోవచ్చు.
జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు :
పోటీలను దశల వారీగా నిర్వహిస్తారు. తొలుత జిల్లా, జోనల్ స్థాయిలో పోటీలు జరుగుతాయి. అక్కడ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో విజేతలు ప్రాంతీయ, ఆ తర్వాత జాతీయ స్థాయి పోటీలకు చేరుకుంటారు.జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా లభించొచ్చు. అందువల్ల ఇది కేవలం పోటీ మాత్రమే కాకుండా.. యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని కెరీర్‌కు కొత్త దారులు వేసుకునే వేదికగా ఉపయోగపడుతుంది.
స్కిల్ ఉంటే కెరీర్‌కు బలం :
ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో ప్రాక్టికల్ నైపుణ్యాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. చదువులో మెరుగ్గా లేకపోయినా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇలాంటి పోటీల్లో పాల్గొనడం ద్వారా యువత తమ సామర్థ్యాన్ని ఇతరులతో పోల్చుకుని, లోపాలను గుర్తించి మరింత మెరుగుపరుచుకోవచ్చు.ప్రత్యేక నైపుణ్యంతో రూపొందించిన ఆవిష్కరణలకు మేధో సంపత్తి హక్కులు, పేటెంట్ వంటి అవకాశాలు కూడా అందుబాటులో ఉండొచ్చు. దీంతో ఒక స్కిల్.. భవిష్యత్ కెరీర్‌కు బలమైన పునాదిగా మారే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు తాము ఎంచుకున్న నైపుణ్య విభాగాన్ని బట్టి వయసు, అర్హతలు, పోటీ నియమాలను ముందుగా పరిశీలించుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘ఇండియా స్కిల్స్ 2026’ విభాగాన్ని ఎంచుకోవాలి.
- మొబైల్ నంబర్ ద్వారా నాలుగు అంకెల పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
- ఆధార్ వివరాలను నమోదు చేసి ఓటీపీ ద్వారా ధ్రువీకరించుకోవాలి.
- ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి.
- పోటీ చేయాలనుకుంటున్న నైపుణ్య విభాగాన్ని ఎంచుకోవాలి.
- అవసరమైన వివరాలు, పత్రాలు నమోదు చేసి దరఖాస్తును సమర్పించాలి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















