యువతను ఆకట్టుకునేలా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా ఆర్-సిరీస్‌లో కొత్త మోటార్‌సైకిల్‌ను తీసుకొచ్చింది. YZF-R2 పేరుతో విడుదల చేసిన ఈ బైక్ ప్రారంభ ధరను రూ.2.30 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. టాప్ వేరియంట్ R2M ధర రూ.2.53 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ప్రకటించింది. ఈ బైక్ డెలివరీలు సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి.
ఆర్-సిరీస్‌లోనే అత్యంత తక్కువ బరువు కలిగిన మోటార్‌సైకిల్‌గా YZF-R2ను యమహా రూపొందించింది. దీని బరువు 149 కేజీలు కాగా.. సీటు ఎత్తు 810 మి.మీ.గా ఉంది. 17 అంగుళాల వీల్స్‌ను అమర్చారు. కొత్తగా అభివృద్ధి చేసిన 204 సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఇందులో అందించారు.
ఈ ఇంజిన్ గరిష్ఠంగా 26.1 పీఎస్ పవర్, 19.1 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌ను ప్రామాణికంగా అందించారు. ముందు భాగంలో 282 మి.మీ. డిస్క్ బ్రేక్‌ను అమర్చగా.. బైక్ చుట్టూ ఆల్-ఎల్‌ఈడీ లైటింగ్ ఇచ్చారు.
రైడర్ తన అవసరానికి అనుగుణంగా బైక్ పనితీరును మార్చుకునేలా స్ట్రీట్, రెయిన్, స్పోర్ట్స్, కస్టమ్ అనే నాలుగు రైడింగ్ మోడ్‌లను అందించారు. టాప్ వేరియంట్ R2Mలో అదనంగా టీఎఫ్‌టీ స్క్రీన్, స్మార్ట్ కీ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.
యమహా YZF-R2ను మిడ్, R2M అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. మెటాలిక్ బ్లాక్, డార్క్ బ్లూయిష్ గ్రే, మ్యాట్ వైట్ పెర్ల్, రేసింగ్ బ్లూ, మెటాలిక్ గ్రే రంగుల్లో ఈ బైక్ లభించనుంది. అయితే మెటాలిక్ గ్రే రంగును టాప్ వేరియంట్ R2Mలో పరిమిత ఎడిషన్‌గా మాత్రమే అందించనున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















