ఆర్టీసీ బస్సుల్లో సీటు దక్కించుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో బస్సు ఎక్కాలంటేనే ప్రయాణికులు నానా అవస్థలు పడుతుంటారు. సీటు కోసం ఒక్కోసారి ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు కూడా జరుగుతుంటాయి. తాజాగా ఓ వృద్ధుడు సీటు కోసం చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ వృద్ధుడు ఎర్ర రంగు ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే బస్సు తలుపు వద్ద ప్రయాణికులు భారీగా ఉండటంతో ఆ దారి నుంచి ఎక్కడం కష్టంగా మారింది. దీంతో ఆయన మరో మార్గాన్ని ఎంచుకున్నారు.
బస్సు పక్కనే ఉన్న టైర్లను ఆధారంగా చేసుకుని పైకి ఎక్కిన వృద్ధుడు.. నేరుగా కిటికీలోంచి బస్సులోకి ప్రవేశించాడు. ఆయన బస్సు ఎక్కిన తీరును చూసి బస్‌స్టాప్‌లో ఉన్న ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. సీటు కోసం వృద్ధుడు చేసిన ఈ ప్రయత్నం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు ఆయన్ను ‘దేశీ స్పైడర్‌మ్యాన్’ అంటూ సరదాగా పిలుస్తున్నారు. మరికొందరు ఆయన ఫిట్‌నెస్‌ను ప్రశంసిస్తున్నారు. యువకులు సైతం బస్సు ఎక్కేటప్పుడు ఆయాసపడుతుంటే.. ఈ వృద్ధుడు మాత్రం ఏమాత్రం తగ్గకుండా కిటికీలోంచి బస్సెక్కాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే రద్దీగా ఉన్న బస్సులను ఎక్కేందుకు ఇలాంటి సాహసాలు చేయడం ప్రమాదకరమని, ప్రయాణికులు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేవారూ ఉన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















