అమెరికాకు వలసలను నియంత్రించడంపై దృష్టి సారించిన ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో నిర్వహించే ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయడం, భవిష్యత్తులో ప్రభుత్వ ప్రయోజనాలపై ఆధారపడే అవకాశం ఉన్న వలసదారులను గుర్తించడం ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
వీసా దరఖాస్తులను మరింత సమగ్రంగా, ఒకే విధానంలో పరిశీలించేందుకు అమెరికా కాన్సులర్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ‘పబ్లిక్ ఛార్జ్’ పరిధిలోకి వచ్చే వ్యక్తులను గుర్తించే విధానంపై వారికి శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక అవసరాల కోసం ప్రధానంగా అమెరికా ప్రభుత్వ సహాయంపై ఆధారపడే వ్యక్తులను ఈ వర్గంలో పరిగణిస్తారు.
వలస వచ్చే విదేశీయుల్లో ఇలాంటి వారు అధికంగా ఉంటే.. అర్హులైన అమెరికా పౌరులకు ప్రభుత్వ ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుల పరిశీలనలో ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
కాన్సులర్ అధికారుల శిక్షణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటికే అపాయింట్‌మెంట్ పొందిన వారి ఇంటర్వ్యూలను రీషెడ్యూల్ చేయనున్నట్లు, కొత్త తేదీలను దరఖాస్తుదారులకు తెలియజేస్తామని అమెరికా అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ‘పబ్లిక్ ఛార్జ్’గా మారే అవకాశం ఉందన్న కారణంతో కొన్ని దేశాల పౌరులకు ఇమిగ్రెంట్ వీసాలు మంజూరు చేయడంపై అమెరికా ప్రభుత్వం కొంతకాలంగా కఠిన వైఖరి అవలంబిస్తోంది.
మరోవైపు హెచ్-1బీ వీసాలపై 1,03,265 డాలర్ల అదనపు ఫీజు విధించాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదనపై భారతీయ అమెరికన్ అడ్వొకసీ గ్రూప్ ఎఫ్‌ఐఐడీఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇంత భారీ రుసుము వల్ల అమెరికాలోని సంస్థలకు నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడం భారంగా మారుతుందని, ఫలితంగా అధిక విలువ కలిగిన ఉద్యోగాలు అమెరికా వెలుపలికి తరలిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















