క్షాబంధన్ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. అయితే ఇటీవల పరకాల నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ సీఎం నివాసానికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. పరకాల వివాదం తర్వాత ముఖ్యమంత్రితో ఆమె భేటీ కావడం ఇదే తొలిసారి.
సీఎంతో భేటీ అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సీఎం, మంత్రి మధ్య ఏ అంశాలపై చర్చ జరిగిందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇటీవల ములుగు, పరకాలలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. అయితే వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో మంత్రి కొండా సురేఖ వర్గానికి విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ వర్గీయులను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని సురేఖ వర్గం ఆరోపణలు చేసింది.
ఇదే సమయంలో పరకాలలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డికే పార్టీ టికెట్ దక్కుతుందనే సంకేతాలు సీఎం వ్యాఖ్యల ద్వారా వెలువడ్డాయనే చర్చ మొదలైంది.
సీఎం పర్యటన మరుసటి రోజే కొండా సురేఖ కుమార్తె సుస్మిత పరకాల నియోజకవర్గంలోని గీసుకొండలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించడం రాజకీయంగా మరింత చర్చకు దారితీసింది.
సుస్మిత చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రిపైనే నేరుగా విమర్శలు, ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. అయితే తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాను ఎలా బాధ్యత వహిస్తానని కొండా సురేఖ వివరణ ఇచ్చినట్లు సమాచారం.
అయితే ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నోటీసులకే పరిమితం కాకుండా తదుపరి చర్యలు కూడా ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రక్షాబంధన్ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి కొండా సురేఖ, సీతక్క వెళ్లి రాఖీ కట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా పరకాల వివాదం తర్వాత సురేఖ తొలిసారి ముఖ్యమంత్రిని కలవడంతో ఈ భేటీపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
అయితే భేటీలో ఏ అంశాలపై చర్చ జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. భేటీ అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోవడంతో ఈ వ్యవహారంపై మరిన్ని ఊహాగానాలకు అవకాశం ఏర్పడింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















