స్సెల్ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా ప్రక్రియపై నెలకొన్న వివాదానికి ఆయన వివరణ ఇచ్చారు. తనపై రుణదాతలు పేర్కొన్న మొత్తం క్లెయిమ్ రూ.22,006 కోట్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. వ్యక్తిగత దివాలా ప్రక్రియలో తనపై ఉన్న అసలు క్లెయిమ్ రూ.3,992 కోట్లేనని తెలిపారు.
తాను ఎలాంటి రుణం తీసుకున్న రుణగ్రహీతను కాదని.. కేవలం కొన్ని సంస్థలకు వ్యక్తిగత హామీదారుగా మాత్రమే ఉన్నానని సుభాష్‌చంద్ర స్పష్టం చేశారు. తన పేరుతో ఉన్న హామీల ఆధారంగానే రుణదాతలు దివాలా ప్రక్రియలో భాగమయ్యారని పేర్కొన్నారు.
రూ.3,992 కోట్ల క్లెయిమ్‌లలో ఇప్పటికే రూ.620 కోట్ల మేర పరిష్కారం జరిగిందని.. మరో రూ.1,063 కోట్లను తిరిగి చెల్లించేందుకు సంబంధిత సంస్థలు ముందుకు వచ్చాయని ఆయన వెల్లడించారు. తన వ్యక్తిగత హామీల ఆధారంగా సంస్థలు తీసుకున్న రుణాల్లో ఇప్పటికే రూ.43 వేల కోట్లు చెల్లించారని తెలిపారు.
సుభాష్‌చంద్ర వ్యక్తిగత దివాలా ప్రక్రియలో రుణదాతలు పేర్కొన్న రూ.22,006.57 కోట్ల క్లెయిమ్‌లకు గాను కేవలం రూ.6.5 కోట్ల చెల్లింపుతో పరిష్కార ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపిన విషయం చర్చనీయాంశమైంది. దీనిపై రుణదాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
రికవరీ మొత్తం చాలా తక్కువగా ఉందని పేర్కొంటూ ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నేతృత్వంలోని రుణదాతలు అభ్యంతరాలు తెలిపారు. అయితే వారి అభ్యంతరాలను ఎన్‌సీఎల్‌టీ తిరస్కరించింది.
తమ క్లెయిమ్‌లో కేవలం 3.2 శాతం మాత్రమే తిరిగి వస్తుందని పేర్కొంటూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అప్పీల్ చేయనున్నట్లు ప్రకటించింది. తమ బ్యాంక్ క్లెయిమ్ మొత్తం రూ.680 కోట్లని.. పరిష్కార ప్రణాళిక ప్రకారం అందులో స్వల్ప మొత్తమే లభిస్తుందని తెలిపింది.
ఈ వ్యవహారంపై విదేశాల్లో ఉన్న విజయ్‌మాల్యా స్పందిస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సుభాష్‌చంద్రకు అభినందనలు చెబుతూ.. తన విషయంలో బ్యాంకులు భారీ మొత్తాలను రికవరీ చేసినప్పటికీ ఇంకా తనపై బకాయిలు ఉన్నట్లు చూపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
భారతదేశంలో రుణ పరిష్కార విధానంపై మరోసారి చర్చ మొదలైందని మాల్యా వ్యాఖ్యలు చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

















