ఒకప్పుడు తుపాకులు పట్టిన చేతులు ఇప్పుడు రంగురంగుల రాఖీలను తయారు చేస్తున్నాయి. హింసా మార్గాన్ని వీడి సాధారణ జీవితంలోకి అడుగుపెట్టిన లొంగిపోయిన మావోయిస్టులకు ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా పునరావాస కేంద్రం కొత్త ఆశలను చూపిస్తోంది.
చౌగేల్ గ్రామంలోని ఈ పునరావాస కేంద్రంలో వివిధ వృత్తుల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. ఇందులో భాగంగా రక్షాబంధన్ సందర్భంగా ప్రత్యేకంగా రాఖీల తయారీ కార్యక్రమాన్ని చేపట్టారు. శిక్షణ పొందుతున్న వారు వెయ్యికి పైగా రాఖీలను ఆకర్షణీయంగా రూపొందించారు.
రంగురంగుల దారాలు, పూసలు, అందమైన అలంకరణలతో తయారు చేసిన ఈ రాఖీలు మార్కెట్లో మంచి ఆదరణ పొందాయి. తమ శ్రమకు తగిన గుర్తింపు, ఆదాయం లభిస్తుండటంతో శిక్షణ పొందుతున్న వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పునరావాస కేంద్రం కేవలం శిక్షణకు మాత్రమే పరిమితం కాకుండా.. లొంగిపోయిన మావోయిస్టులకు గౌరవప్రదమైన జీవన మార్గాన్ని అందించే వేదికగా మారింది. రాఖీల తయారీతో పాటు వివిధ చేతివృత్తులు, ఉపాధి అవకాశాలకు సంబంధించిన శిక్షణను కూడా అందిస్తున్నారు.
గతంలో హోలీ పండుగ సందర్భంగా గులాల్ తయారీని కూడా వీరితో చేయించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు సమాజంలో తిరిగి స్థిరపడేందుకు సహకరిస్తున్నారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ ఆకాశ్ శ్రీశ్రీమాల్ మాట్లాడుతూ.. లొంగిపోయిన వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని, రాఖీల తయారీతో పాటు ఇతర ఉపాధి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.
రాఖీ పండుగ తన జీవితంలో ప్రత్యేకమైనదని ఓ మహిళా శిక్షణార్థి తెలిపారు. గతంలో అడవుల్లో ఉన్న సమయంలో రక్షాబంధన్ గురించి వినడమే తప్ప పండుగ చేసుకునే అవకాశం రాలేదని, ఇప్పుడు భద్రతా సిబ్బంది, తోటి శిక్షణార్థులతో కలిసి రాఖీలు కట్టి వేడుక చేసుకుంటున్నామని చెప్పారు.
తుపాకులను వదిలి చేతివృత్తులను అందిపుచ్చుకున్న వీరి ప్రయాణం.. మార్పు, పునరావాసం, కొత్త జీవితానికి ప్రతీకగా నిలుస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

















