విశాఖపట్నంలో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. అయితే పోలీసులు సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి బాలికను సురక్షితంగా రక్షించారు.
వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన సయ్యద్ అబ్దుల్ హఫీజ్ గని, సయ్యద్ శేషమ్మ దంపతులు దుకాణాల్లో ధూపం వేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడు రోజుల క్రితం వారు విజయవాడ నుంచి విశాఖపట్నానికి వచ్చారు. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాప్ వద్ద తమ నాలుగేళ్ల కుమార్తెతో కలిసి ఫుట్‌పాత్‌పై నిద్రించారు.
అర్ధరాత్రి సమయంలో మెలకువ వచ్చిన తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఎస్.రాయవరం ప్రాంతానికి చెందిన ప్రతిభ, గరివిడి ప్రాంతానికి చెందిన ఉపేంద్ర అనే ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చి బాలికను తీసుకెళ్లినట్లు గుర్తించారు.
సీసీటీవీ దృశ్యాల్లో బాలికను గాజువాక వైపు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. స్కూటీ నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించి, వారి నుంచి బాలికను రక్షించారు. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















