జన్మతః పౌరసత్వం అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ వలసదారుల పిల్లలకు అమెరికాలో జన్మించిన వెంటనే లభించే పౌరసత్వంపై పరిమితులు విధించేలా ఆయన జారీ చేసిన తాజా కార్యనిర్వాహక ఉత్తర్వులను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు నిలిపివేసింది.
బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై ఆంక్షలు విధించడంతో పాటు బర్త్ టూరిజాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ట్రంప్ ఇటీవల కొత్త ఉత్తర్వులకు సంతకం చేశారు. అమెరికాలో జన్మించినప్పటికీ తల్లిదండ్రుల వలస స్థితి ఆధారంగా పిల్లలకు పౌరసత్వం దక్కకుండా చేసేలా ఈ చర్యలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి.
ఇప్పటికే ఇదే అంశంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి అమెరికా సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ వలసదారులు, తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉన్న వారి పిల్లలు అక్కడ జన్మిస్తే.. వారిని పౌరులుగా పరిగణించాలనే న్యాయపరమైన స్థితి కొనసాగింది. దీంతో విదేశీయుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని నిరాకరించే ట్రంప్ ప్రయత్నానికి అడ్డంకులు ఎదురయ్యాయి.
అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ 1868లో ఆమోదమైంది. దాని ప్రకారం అమెరికా భూభాగంలో జన్మించిన వారికి సాధారణంగా జన్మతః పౌరసత్వం లభిస్తుంది. వారి తల్లిదండ్రులు ఆ దేశంలో అక్రమంగా ఉన్నా లేదా తాత్కాలిక వీసాపై నివసిస్తున్నా.. పిల్లల పౌరసత్వ హక్కుపై ఈ నిబంధన కీలకంగా ఉంటుంది.
అయితే ఈ విధానాన్ని కొందరు బర్త్ టూరిజం కోసం దుర్వినియోగం చేస్తున్నారని ట్రంప్ వాదిస్తున్నారు. అమెరికా పౌరసత్వం పొందే అవకాశాన్ని తమ పిల్లలకు కల్పించాలనే ఉద్దేశంతో గర్భం చివరి దశలో అమెరికాకు వచ్చి అక్కడ ప్రసవించడాన్ని సాధారణంగా బర్త్ టూరిజంగా పేర్కొంటారు.
ఈ విధానాన్ని అడ్డుకోవడం, జన్మతః పౌరసత్వంపై పరిమితులు విధించడం లక్ష్యంగా ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు వరుసగా న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















