కృత్రిమ మేధను చదువు, ఉద్యోగం, పరిశోధన, కోడింగ్ వంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఏఐ ఇచ్చే ప్రతి సమాధానాన్ని వాస్తవంగా భావించడం సరికాదు. ముఖ్యంగా ఇప్పటికే అనుమానాలు, భ్రమాత్మక ఆలోచనలు ఉన్న వ్యక్తులు తమ ఆలోచనలను పదేపదే ఏఐతో చర్చిస్తూ, దాని సమాధానాలను తమ నమ్మకాలకు ఆధారంగా తీసుకుంటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
తనను ఎవరో గమనిస్తున్నారని అనుకోవడం, తనపై కుట్ర జరుగుతోందని నమ్మడం, ప్రపంచాన్ని కాపాడే ప్రత్యేక బాధ్యత తనపై ఉందని భావించడం వంటి లక్షణాలను తేలిగ్గా తీసుకోకూడదు. ఇవి సైకోసిస్‌లో కనిపించే భ్రమాత్మక నమ్మకాలకు సంకేతాలు కావచ్చు. అయితే వ్యక్తిని ప్రత్యక్షంగా పరీక్షించిన తర్వాతే అసలు కారణాన్ని వైద్యులు నిర్ధారించగలరు.
ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు వాదనకు దిగకుండా ప్రశాంతంగా వ్యవహరించడం ముఖ్యం. ‘‘నీ ఆలోచన తప్పు’’ అంటూ నేరుగా ఎదిరించడం కంటే, అతని భయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అదే సమయంలో వైద్య సహాయం తీసుకోవాల్సిన అవసరాన్ని కుటుంబ సభ్యులు తీవ్రంగా పరిగణించాలి.
స్నానం, భోజనం, నిద్ర వంటి రోజువారీ అవసరాలను పట్టించుకోకపోవడం, ఉద్యోగం లేదా సాధారణ పనులు చేయలేకపోవడం, ఇంటి నుంచి బయటకు రాకపోవడం వంటి మార్పులు కనిపిస్తే ఆలస్యం చేయకుండా మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది. ఆసుపత్రికి రావడానికి వ్యక్తి నిరాకరిస్తే కుటుంబ సభ్యులు ముందుగా సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి పరిస్థితిని వివరించవచ్చు.
ఏఐ ఎంత శక్తిమంతమైన సాధనమైనా అది వైద్యుడు కాదు.. అంతేకాదు, అది చెప్పిన ప్రతి విషయం నిజమని భావించకూడదు. సమాచారం కోసం ఏఐని ఉపయోగించండి.. కానీ నిజానిజాలను నిపుణులు, విశ్వసనీయ వనరులతో నిర్ధారించుకోండి. ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల్లో స్వయంగా నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహా తీసుకోవడం అత్యంత ముఖ్యం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















