ఇరాన్‌తో సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై దేశీయంగా ఒత్తిడి పెరుగుతున్న వేళ.. మరో సమస్య ఆ దేశ యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్యలు, అమెరికా ఆయుధ నిల్వలు, క్షిపణుల సంఖ్య వంటి అత్యంత సున్నితమైన సమాచారం మీడియాకు లీక్ అవుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీంతో ఈ సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నది ఎవరో గుర్తించేందుకు ట్రంప్ ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో అమెరికా సైన్యంలోని పలువురు అధికారులు, సిబ్బందికి పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ముఖ్యంగా అమెరికా మిలిటరీ జాయింట్ స్టాఫ్‌కు చెందిన దాదాపు 50 మంది అధికారులు, సిబ్బందికి గత నెలలో నిజ నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ఈ విభాగంలో సుమారు 1,500 నుంచి 2,000 మంది వరకు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్‌పై దాడులకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు వెల్లడించారా? అమెరికా ఆయుధ నిల్వలు, క్షిపణుల లభ్యతకు సంబంధించిన వివరాలను ఎవరితోనైనా పంచుకున్నారా? అనే అంశాలపై పరీక్షల సమయంలో ప్రశ్నలు అడిగినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ కథనాలు పేర్కొన్నాయి.
అయితే జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్‌తో పాటు కొందరు అత్యున్నత స్థాయి సైనికాధికారులకు ఈ పరీక్షలు నిర్వహించలేదని పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి.
ఈ వ్యవహారంపై పెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ స్పందించారు. అంతర్గత సిబ్బందిపై జరుగుతున్న దర్యాప్తు, తీసుకుంటున్న చర్యల గురించి తాము వ్యాఖ్యానించలేమని తెలిపారు. అయితే జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం లీక్ అయినట్లు తేలితే దాన్ని తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా మోహరించిన అమెరికా సైనికుల భద్రతకు సంబంధించిన కీలక సమాచారం బయటకు పొక్కకుండా చూడటం అత్యంత ముఖ్యమని పెంటగాన్ పేర్కొంది. సైనిక కార్యకలాపాలు, ఆయుధ సామర్థ్యాలు, నిల్వలకు సంబంధించిన వివరాలు శత్రు దేశాలకు చేరితే అమెరికా బలగాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి అమెరికా భారీగా ఆయుధాలను వినియోగిస్తున్నట్లు, ఫలితంగా కీలకమైన క్షిపణులు, ఇతర ఆయుధ నిల్వలు తగ్గుతున్నట్లు గత కొంతకాలంగా కథనాలు వస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి వివరాలు రక్షణ రంగంలోని అత్యంత కొద్దిమంది సీనియర్ అధికారులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
అయినప్పటికీ ఈ సమాచారం మీడియాకు చేరుతుండటంతో అమెరికా రక్షణ వ్యవస్థలో లీకేజీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం ఏ మార్గంలో బయటకు వెళ్తోంది? దాని వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
మరోవైపు అమెరికా సైనిక సిబ్బంది ఉపయోగించే ఫోన్లు, కంప్యూటర్లలోని యాడ్ ట్రాకర్లను కూడా మిలిటరీ నిలిపివేసినట్లు సమాచారం. డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా సైనికుల స్థానం, వారు పనిచేస్తున్న ప్రాంతాల వివరాలు తెలుసుకునే అవకాశం ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆర్మీతో పాటు ఎయిర్‌ఫోర్స్, ప్రత్యేక ఆపరేషన్స్ కమాండ్‌లో పనిచేస్తున్న సిబ్బంది ఉపయోగించే కొన్ని డివైజ్‌లలోనూ ఇలాంటి ట్రాకింగ్ వ్యవస్థలను బ్లాక్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సైనికుల కదలికలు, స్థావరాల వివరాలు శత్రువులకు చేరకుండా డిజిటల్ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















