ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

యుద్ధ రహస్యాలు లీక్‌.. మిలిటరీ అధికారులకు ట్రంప్‌ ‘లై డిటెక్టర్‌’ పరీక్షలు

September 5, 2026
in World News, News
0
యుద్ధ రహస్యాలు లీక్‌.. మిలిటరీ అధికారులకు ట్రంప్‌ ‘లై డిటెక్టర్‌’ పరీక్షలు

యుద్ధ రహస్యాలు లీక్‌.. మిలిటరీ అధికారులకు ట్రంప్‌ ‘లై డిటెక్టర్‌’ పరీక్షలు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇరాన్‌తో సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంపై దేశీయంగా ఒత్తిడి పెరుగుతున్న వేళ.. మరో సమస్య ఆ దేశ యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్యలు, అమెరికా ఆయుధ నిల్వలు, క్షిపణుల సంఖ్య వంటి అత్యంత సున్నితమైన సమాచారం మీడియాకు లీక్‌ అవుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీంతో ఈ సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నది ఎవరో గుర్తించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో అమెరికా సైన్యంలోని పలువురు అధికారులు, సిబ్బందికి పాలీగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ముఖ్యంగా అమెరికా మిలిటరీ జాయింట్‌ స్టాఫ్‌కు చెందిన దాదాపు 50 మంది అధికారులు, సిబ్బందికి గత నెలలో నిజ నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ఈ విభాగంలో సుమారు 1,500 నుంచి 2,000 మంది వరకు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇరాన్‌పై దాడులకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు వెల్లడించారా? అమెరికా ఆయుధ నిల్వలు, క్షిపణుల లభ్యతకు సంబంధించిన వివరాలను ఎవరితోనైనా పంచుకున్నారా? అనే అంశాలపై పరీక్షల సమయంలో ప్రశ్నలు అడిగినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ కథనాలు పేర్కొన్నాయి.

అయితే జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌తో పాటు కొందరు అత్యున్నత స్థాయి సైనికాధికారులకు ఈ పరీక్షలు నిర్వహించలేదని పెంటగాన్‌ వర్గాలు వెల్లడించాయి.

ఈ వ్యవహారంపై పెంటగాన్‌ అధికార ప్రతినిధి సీన్‌ పార్నెల్‌ స్పందించారు. అంతర్గత సిబ్బందిపై జరుగుతున్న దర్యాప్తు, తీసుకుంటున్న చర్యల గురించి తాము వ్యాఖ్యానించలేమని తెలిపారు. అయితే జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం లీక్‌ అయినట్లు తేలితే దాన్ని తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా మోహరించిన అమెరికా సైనికుల భద్రతకు సంబంధించిన కీలక సమాచారం బయటకు పొక్కకుండా చూడటం అత్యంత ముఖ్యమని పెంటగాన్‌ పేర్కొంది. సైనిక కార్యకలాపాలు, ఆయుధ సామర్థ్యాలు, నిల్వలకు సంబంధించిన వివరాలు శత్రు దేశాలకు చేరితే అమెరికా బలగాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి అమెరికా భారీగా ఆయుధాలను వినియోగిస్తున్నట్లు, ఫలితంగా కీలకమైన క్షిపణులు, ఇతర ఆయుధ నిల్వలు తగ్గుతున్నట్లు గత కొంతకాలంగా కథనాలు వస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి వివరాలు రక్షణ రంగంలోని అత్యంత కొద్దిమంది సీనియర్‌ అధికారులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

అయినప్పటికీ ఈ సమాచారం మీడియాకు చేరుతుండటంతో అమెరికా రక్షణ వ్యవస్థలో లీకేజీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం ఏ మార్గంలో బయటకు వెళ్తోంది? దాని వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

మరోవైపు అమెరికా సైనిక సిబ్బంది ఉపయోగించే ఫోన్లు, కంప్యూటర్లలోని యాడ్‌ ట్రాకర్లను కూడా మిలిటరీ నిలిపివేసినట్లు సమాచారం. డిజిటల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థల ద్వారా సైనికుల స్థానం, వారు పనిచేస్తున్న ప్రాంతాల వివరాలు తెలుసుకునే అవకాశం ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆర్మీతో పాటు ఎయిర్‌ఫోర్స్‌, ప్రత్యేక ఆపరేషన్స్‌ కమాండ్‌లో పనిచేస్తున్న సిబ్బంది ఉపయోగించే కొన్ని డివైజ్‌లలోనూ ఇలాంటి ట్రాకింగ్‌ వ్యవస్థలను బ్లాక్‌ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సైనికుల కదలికలు, స్థావరాల వివరాలు శత్రువులకు చేరకుండా డిజిటల్‌ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Donald TrumpiranIran WarJoint Chiefs of StaffLie DetectorMilitary LeaksMilitary SecretsMissile StockpilesNational SecurityPentagonPolygraph Testshivasakthi newsshivasakthimediaUS Air ForceUS ArmyUS militaryUSA
ShareTweetSend
Previous Post

ఇరాన్‌తో యుద్ధం వేళ.. సౌదీకి అమెరికా భారీ ఆయుధ ప్యాకేజీ

Next Post

ఏఐతో కుబేరులకు కాసుల వర్షం.. 15 ట్రిలియన్‌ డాలర్లకు సంపద

Related Posts

నువ్వెవరికి తెలుసు?’.. ఆ ప్రశ్న నన్ను వెంటాడింది: వైష్ణవి చైతన్య
Movies

‘నువ్వెవరికి తెలుసు?’.. ఆ ప్రశ్న నన్ను వెంటాడింది: వైష్ణవి చైతన్య

September 5, 2026
చైనా మాస్టర్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోరు.. వరుసగా నాలుగోసారి సెమీస్‌కు!
Sports News

చైనా మాస్టర్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోరు.. వరుసగా నాలుగోసారి సెమీస్‌కు!

September 5, 2026
వైభవ్‌ ఉన్నాడనే నా భార్య క్రికెట్‌ చూస్తోంది: శ్రీకాంత్‌
Sports News

వైభవ్‌ ఉన్నాడనే నా భార్య క్రికెట్‌ చూస్తోంది: శ్రీకాంత్‌

September 5, 2026
పిరికిపందలతో పోటీ పడ్డా.. జాకబ్‌ ఇంగెబ్రిట్‌సెన్‌ సంచలన వ్యాఖ్యలు
Sports News

పిరికిపందలతో పోటీ పడ్డా.. జాకబ్‌ ఇంగెబ్రిట్‌సెన్‌ సంచలన వ్యాఖ్యలు

September 5, 2026
బీసీసీఐ రిక్వెస్ట్‌కు ఐవోఏ నో.. ప్రత్యేక వసతులు కల్పించలేం!
Sports News

బీసీసీఐ రిక్వెస్ట్‌కు ఐవోఏ నో.. ప్రత్యేక వసతులు కల్పించలేం!

September 5, 2026
బాబర్‌ ‘డమ్మీ కెప్టెన్‌’.. పీసీబీదే రిమోట్‌ కంట్రోల్‌: రషీద్‌ లతీఫ్‌
Sports News

బాబర్‌ ‘డమ్మీ కెప్టెన్‌’.. పీసీబీదే రిమోట్‌ కంట్రోల్‌: రషీద్‌ లతీఫ్‌

September 5, 2026
Next Post
ఏఐతో కుబేరులకు కాసుల వర్షం.. 15 ట్రిలియన్‌ డాలర్లకు సంపద

ఏఐతో కుబేరులకు కాసుల వర్షం.. 15 ట్రిలియన్‌ డాలర్లకు సంపద

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 5, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 5, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
5 సెప్టెంబర్ 2026 (శనివారం)

పంచాంగం: 5 సెప్టెంబర్ 2026 (శనివారం)

September 5, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
చైనా మాస్టర్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోరు.. వరుసగా నాలుగోసారి సెమీస్‌కు!

చైనా మాస్టర్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోరు.. వరుసగా నాలుగోసారి సెమీస్‌కు!

September 5, 2026
వైభవ్‌ ఉన్నాడనే నా భార్య క్రికెట్‌ చూస్తోంది: శ్రీకాంత్‌

వైభవ్‌ ఉన్నాడనే నా భార్య క్రికెట్‌ చూస్తోంది: శ్రీకాంత్‌

September 5, 2026
పిరికిపందలతో పోటీ పడ్డా.. జాకబ్‌ ఇంగెబ్రిట్‌సెన్‌ సంచలన వ్యాఖ్యలు

పిరికిపందలతో పోటీ పడ్డా.. జాకబ్‌ ఇంగెబ్రిట్‌సెన్‌ సంచలన వ్యాఖ్యలు

September 5, 2026
బీసీసీఐ రిక్వెస్ట్‌కు ఐవోఏ నో.. ప్రత్యేక వసతులు కల్పించలేం!

బీసీసీఐ రిక్వెస్ట్‌కు ఐవోఏ నో.. ప్రత్యేక వసతులు కల్పించలేం!

September 5, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

చైనా మాస్టర్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోరు.. వరుసగా నాలుగోసారి సెమీస్‌కు!

చైనా మాస్టర్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోరు.. వరుసగా నాలుగోసారి సెమీస్‌కు!

September 5, 2026
వైభవ్‌ ఉన్నాడనే నా భార్య క్రికెట్‌ చూస్తోంది: శ్రీకాంత్‌

వైభవ్‌ ఉన్నాడనే నా భార్య క్రికెట్‌ చూస్తోంది: శ్రీకాంత్‌

September 5, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.