ఆసియా గేమ్స్ మహిళల క్రికెట్‌లో భారత మహిళా జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో జపాన్‌పై ఏకపక్ష విజయం సాధించి తదుపరి దశకు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ భారత బౌలర్ల ధాటికి 19.5 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది.
తెలుగు అమ్మాయి శ్రీచరణి అద్భుతమైన బౌలింగ్‌తో జపాన్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చింది. 4 ఓవర్లలో కేవలం 10 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. షఫాలీ వర్మ రెండు వికెట్లు తీయగా.. శ్రేయాంకా పాటిల్, దీప్తి శర్మ చెరో వికెట్ సాధించారు. జపాన్ తరఫున అయకా కటో 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. హరున ఇవాసాకి 10 పరుగులు చేసింది. మిగిలిన బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ షఫాలీ వర్మ ధాటిగా ఆడుతూ 15 బంతుల్లోనే 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కమలిని డకౌట్ కాగా.. భారతి 6 పరుగులు చేసింది. రిచా ఘోష్ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచి షఫాలీతో కలిసి విజయాన్ని పూర్తి చేసింది.
ఈ విజయంతో భారత్ సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. మరో క్వార్టర్ ఫైనల్లో శ్రీలంక మలేషియాను ఓడించి సెమీస్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 160/4 పరుగులు చేయగా.. మలేషియా 74 పరుగులకే ఆలౌటైంది. దీంతో శ్రీలంక సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. సెమీఫైనల్ మ్యాచ్‌లు ఆదివారం జరగనున్నాయి. ఫైనల్, మూడో స్థానం కోసం పోటీలు మంగళవారం నిర్వహించనున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















