పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల వేళ మమతా బెనర్జీ వర్గంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెజీనగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న రబియుల్ ఆలం చౌదరి శనివారం ఉదయం నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు. అయితే కొన్ని గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకుని ఎన్నికల బరిలో కొనసాగనున్నట్లు వెల్లడించారు.
పార్టీ కార్యకర్తలకు ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రచారానికి తక్కువ సమయం, కొత్త ఎన్నికల గుర్తుతో పోటీ చేయాల్సిన పరిస్థితి వంటి అంశాలను రబియుల్ ప్రస్తావించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అనంతరం మమతా బెనర్జీతో చర్చలు జరిపిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇప్పటికే నందిగ్రామ్ ఉప ఎన్నికలో మమత వర్గం అభ్యర్థి సంచితా ప్రధాన్ డే పోటీ నుంచి తప్పుకున్నారు. అనంతరం మమతా బెనర్జీ కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు మద్దతు ప్రకటించారు. అయితే మిలన్ ప్రధాన్‌ను 2007 నాటి కేసులకు సంబంధించిన అరెస్టు చేయడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయగా, పోలీసులు పెండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలులో భాగంగానే అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, తృణమూల్ కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఎన్నికల సంఘం రెండు వర్గాలు అసలు పార్టీ పేరు, సంప్రదాయ ‘జోడా గడ్డి పువ్వులు’ గుర్తును ఉపయోగించకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. మమతా బెనర్జీ వర్గానికి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ పేరుతో ‘ఫుట్‌బాల్ ప్లేయర్’ గుర్తును కేటాయించగా, ప్రత్యర్థి వర్గానికి ‘డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ పేరుతో ‘ఎన్వలప్’ గుర్తును కేటాయించింది.
ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో అక్టోబర్ 6న నందిగ్రామ్, రెజీనగర్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















