శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు స్వర్ణ రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం జరిగిన స్వర్ణ రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వర్ణ రథాన్ని లాగేందుకు వేలాది మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అంతకుముందు ఉదయం హనుమంత వాహనంపై శ్రీకోదండ రాముని అలంకారంలో మలయప్ప స్వామివారు మాడవీధుల్లో విహరించారు. రాత్రి గజ వాహనసేవ ఘనంగా జరిగింది. గజరాజుల ఠీవి, భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన వాహనసేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారి వాహనసేవలను వీక్షించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
ఈ వాహనసేవల్లో పెద్దజీయర్, చిన్నజీయర్, తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్‌వర్మ, తితిదే సీవీఎస్‌వో మురళీకృష్ణ, సినీనటుడు బాలకృష్ణ సతీమణి వసుంధర తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనసేవ, మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి చంద్రప్రభ వాహనసేవ జరగనుంది. ఈనెల 23న నిర్వహించే చక్రస్నానంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















