కాకినాడలో నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమం దేశభక్తి, నైతిక విలువలు, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో సాగింది. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి నారా లోకేశ్.. జీవితంలో ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలకు కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ పరీక్షలతో పాటు వాటిని ఎదుర్కొనే శక్తి కూడా ఉంటుందని చెప్పారు.
దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని సైనికులే నిజమైన హీరోలని లోకేశ్ పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధవీరుడు కిరణ్కుమార్ పోరాటాన్ని, ఆపరేషన్ సిందూర్లో ప్రాణాలు కోల్పోయిన జవాను మురళీనాయక్ త్యాగాన్ని ప్రస్తావిస్తూ.. దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు.
పిల్లల వ్యక్తిత్వ వికాసంలో నైతిక విలువలకు కీలక పాత్ర ఉందని లోకేశ్ చెప్పారు. ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని చిన్న వయసు నుంచే పిల్లలకు అర్థమయ్యేలా చేయాలని సూచించారు. చదువు, ఆటలతో పాటు విలువలను నేర్పితే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు.
విద్యార్థులు అపజయాలను చూసి నిరుత్సాహపడకుండా వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ‘ఫెయిల్’ను ‘ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్’గా చూడాలన్న ఆయన వ్యాఖ్యలు విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపాయి.
చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రలను పిల్లలకు పరిచయం చేయాలని సూచించారు. వారి పోరాటాలు, త్యాగాల గురించి తెలుసుకోవడం ద్వారా దేశభక్తి, బాధ్యతాభావం పెంపొందుతాయని అన్నారు. పుస్తకాలను పిల్లలకు బహుమతులుగా ఇవ్వడంతో పాటు స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించిన చారిత్రక ప్రదేశాలను వారికి చూపించాలని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews














