ఎఫ్‌టీఏ అంటే ఏమిటి?
భారత్–ఐరోపా సమాఖ్య (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు విజయవంతంగా ముగిశాయి. 27 దేశాల సమాఖ్య అయిన ఈయూకు మన దేశ ఎగుమతులకు ప్రాధాన్య ప్రవేశం లభించనుంది.
🔹 మన దేశానికి ప్రధాన లాభాలు
- దాదాపు 99% భారత ఎగుమతులకు ఈయూలో సులువైన ప్రవేశం
- రూ.6.9 లక్షల కోట్ల విలువైన ఎగుమతులకు లబ్ధి
- 93% పైగా ఉత్పత్తులపై సుంకం పూర్తిగా తొలగింపు
- సగటు ఈయూ టారిఫ్ 3.8% నుంచి 0.1%కి తగ్గింపు
- MSMEలు, మహిళలు, యువత, కళాకారులు, వృత్తినిపుణులకు కొత్త ఉద్యోగావకాశాలు
🔹 ఈ రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం
- తెలంగాణ (హైదరాబాద్, వరంగల్)
- ఆంధ్రప్రదేశ్ (విశాఖ, కాకినాడ)
- తమిళనాడు (తిరుపూర్, వేలూరు–అంబూరు)
- గుజరాత్ (సూరత్)
- మహారాష్ట్ర (ఇచల్కరంజి, ముంబయి)
- పంజాబ్ (లుథియానా)
- ఉత్తరప్రదేశ్ (కాన్పూర్, ఆగ్రా)
వస్త్రాలు, సముద్ర ఉత్పత్తులు, తోలు–పాదరక్షలు, రత్నాభరణాల రంగాలకు పెద్ద ఊతం లభించనుంది.
🔹 ఏ రంగాలకు ఎక్కువ మేలు?
- జౌళి, దుస్తులు
- సముద్ర ఉత్పత్తులు
- పాదరక్షలు, తోళ్లు
- రసాయనాలు, ప్లాస్టిక్స్
- స్పోర్ట్స్ వస్తువులు, బొమ్మలు
- రత్నాభరణాలు
ఇప్పటి వరకు 4–26% ఉన్న సుంకాలు FTA అమల్లోకి వచ్చిన వెంటనే 0% అవుతాయి.
🔹 విద్యార్థులు & వృత్తినిపుణులకు శుభవార్త
- ఈయూ దేశాలకు వర్క్ వీసాలు సులువు
- విద్యార్థుల రాకపోకలపై పరిమితులు ఉండవు
- సేవల రంగంలో 144 ఈయూ ఉప రంగాలు భారతీయులకు అందుబాటులోకి వస్తాయి
🔹 వినియోగదారులకు లాభం
- ఐరోపా నుంచి వచ్చే చాకొలెట్లు, వైన్, కాస్మోటిక్స్ ధరలు తగ్గే అవకాశం
- ఖరీదైన వైన్‌లపై సుంకం 150% నుంచి 20%కి తగ్గింపు
🔹 విలాస కార్ల ధరలు తగ్గుతాయా?
- ఏటా 2.5 లక్షల కార్ల దిగుమతులకు కోటా
- పన్ను 110% నుంచి 10%కి దశలవారీగా తగ్గింపు
- అయితే కంపెనీల ప్రకారం కార్ల ధరలు వెంటనే తగ్గే అవకాశం లేదు
🔹 ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?
- వచ్చే 5–7 నెలల్లో ఒప్పందంపై సంతకాలు
- 2026 చివర్లో లేదా 2027 ఆరంభంలో అమల్లోకి వచ్చే అవకాశం
🔹 మొత్తంగా
భారత్–ఈయూ FTA ఒప్పందం దేశ ఆర్థిక వ్యవస్థకు, ఎగుమతులకు, ఉద్యోగాలకు పెద్ద మైలురాయిగా నిలవనుంది. అమెరికా భారీ సుంకాలు విధిస్తున్న ఈ సమయంలో, ఈ ఒప్పందం భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















